పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ

Submitted by Upender Bukka on Wed, 28/09/2022 - 08:47
Bathukamma is a great festival of worshiping flowers

డీఆర్డీఏ ఆధ్వర్యంలో అలరించిన బతుకమ్మ సంబురాలు

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 27 సెప్టెంబర్.///..  తెలంగాణ   సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా    పూలను పూజించే గొప్ప పండుగ  బతుకమ్మ తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేకమని  డీఆర్డీఏ పీడీ సుందరి కిరణ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా  డీఆర్డీఏ ఆధ్వర్యంలో  మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ  వేడుకలను సూర్యాపేట సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ వద్ద పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతియేటా బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేస్తున్నారని దీంతో ఆడపడుచుల కండ్లల్లో ఆనందం నెలకొందన్నారు. ఆడపడుచులు బతుకమ్మ ఉత్సవాలను  ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మెప్మా పీడీ రమేశ్ నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు చింతలపాటి భరత్ మహాజన్, ఆకుల కవిత లవకుశ, రాపర్తి శ్రీనివాస్, ఎడ్ల గంగాభవాని, జ్యోతి శ్రీవిద్య కరుణాకర్, శిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ  మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు  స్వరూపారాణి, మహిళలు మెప్మా ఆర్పీలు  పెద్ద ఎత్తున పాల్గొన్నారు