రైతాంగాన్ని దివాలా తీయిస్తున్న, కేంద్ర. బిజెపి మోడీ ప్రభుత్వం . తెలంగాణ రైతు సంఘం. జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకన్న

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 13:23
Bankrupting the peasantry, Kendra. BJP Modi Govt. Telangana Rythu Sangam. District Chief Secretary Shetty Venkanna


  తొర్రూరు సెప్టెంబర్ 18( ప్రజా జ్యోతి) .. తొర్రూరు మండల కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో  ,తెలంగాణ రైతు సంఘం. మండల అధ్యక్షులు. జిన్నపురెడ్డి, అధ్యక్షతన జరిగిన విస్తృత సమావేశానిలో, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. శెట్టి వెంకన్న పాల్గొని మాట్లాడుతూ .కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత రైతు .ప్రజా .కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రైతాంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తుందని అన్నారు. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చే ముందు రైతులకు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలు నెరవేర్చకపోగా ప్రజలపై అనేక భారాలు మోపుతూ దేశ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక అని సభలలో మాట్లాడిన దానికి చేసే పనికి తేడా లేకుండా పోయిందని, నీతులు  పలికిన నేతలు రైతులను నట్టేట ముంచే నల్ల చట్టాలను తెచ్చి రైతులు లేకుండా చేస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యపట్టారు .అది రైతుల పోరాటంతో వెనక్కు కొట్టిందని రైతుల పోరాటవిజయంగా వివరించారు రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కౌలు రైతులను ఆదుకోవాలని పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని .రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.

ఇప్పటికైనా కేంద్ర .రాష్ట్ర .ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేనియెడల ప్రజలే పాలకులకు బుద్ధి చెప్తారని అగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు. జిన్నపురెడ్డి సోమిరెడ్డి తెలంగాణ రైతు సంఘం మండల నకులు గుద్దేటి సాయమల్లు కొత్త వెంకటరెడ్డి  తాళ్ల వెంకటేశ్వర్లు గజ్జి రాంమూర్తి కాయల ఎల్లయ్య కొండరాము వ్య.కా.సం జిల్లా నాయకులు షేక్ యాకూబ్, సిఐటియు మండల కార్యదర్శి .జమ్ముల శ్రీను ఇట్ట మహేందర్ మంద మల్లారెడ్డి నరెడ్ల జితేందర్రెడ్డితదితరులు,కార్యక్రమంలో పాల్గొన్నారు.