తడి పొడి విధానంపై రైతులకు అవగాహన -కేవికే శాస్త్రవేత్త భరత్

Submitted by venkat reddy on Fri, 23/09/2022 - 10:15
Awareness of farmers on wet and dry system -KVK Scientist Bharat

ఫోటో రైటప్ ః తడి పొడి విధానంపై రైతులకు అవగాహన  కల్పిస్తున్న కేవికే శాస్త్రవేత్త భరత్

నిడమనూరు, సెప్టెంబర్22(ప్రజాజ్యోతి):  తడి పొడి విధానంపై కేవికే శాస్త్రవేత్త భరత్ అవగాహన కల్పించారు. నిడమనూరు మండల కేంద్రంలోని రైతు వేధికలో గురువారం స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ కోరే కార్బన్ ఎక్స్ సోల్యూషన్ వారి ఆధ్వర్యంలో  రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈసందర్భంగా  కేవికే శాస్త్రవేత్త భరత్,ఏవో మునికృష్ణ, స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ సొసైటీ  ప్రెసిడెంట్ గౌస్ మియా లు
మాట్లాడుతూ వరి సాగు విధానంలో మీథేన్ అనే విష వాయువు కాలుష్యాన్ని  విడుదల చేసి అనేక వాతావరణ మార్పులకు విఘాతం కల్గిస్తుందన్నారు. అదేవిధంగా ఈ మీథేన్ వాయువును నివారించాలంటే వరి సాగును తడి పొడి పద్ధతిలో సాగు చేస్తే మీథేన్ వాయువు ను అరికట్టవచ్చు.వరి సాగును తడి పొడి పద్ధతిలో ఏ విధంగా సాగు చేయాలో రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో  క్లస్టర్ అధికారి జయశ్రీ, క్లస్టర్ సూపర్ వైజర్ నరేష్, కోఆర్డినేట్ కరుణాకర్ ,ప్రజాప్రతినిధులు, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు ,రైతులు ,తదితరులు, పాల్గొన్నారు.