జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

Submitted by Sathish Kammampati on Tue, 13/09/2022 - 10:22
Arrangements should be made for conducting National Unity Diamond Festivals
  • జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి 

నల్లగొండ సెప్టెంబర్ 12(ప్రజాజ్యోతి)ప్రతినిధి: ఈ నెల 16,17,18 తేదీ లలో నల్గొండ నియోజక వర్గ కేంద్రం లో నిర్వహించనున్న జాతీయ సమైక్యతా వజ్రొత్సవాలు విజయ వంతం గా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు.సోమవారం అర్.డి. ఓ కార్యాలయం లో   నల్గొండ నియోజక వర్గ ఎం.పి.డి. ఓ.లు,తహశీల్దార్ లు,మున్సిపల్,విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశం లో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహణ పై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఇటీవల పక్షం రోజుల పాటు నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రొత్సవ వేడుకలు జిల్లాలో విజయవంతం చేసిన అందరికీ ధన్య వాదాలు తెలిపారు.

స్వతంత్ర భారత వజ్రొత్సవ వేడుకలు విజయ వంతం చేసిన విధంగా న ఈ నెల 16,17,18 తేదీలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న నల్గొండ నియోజకవర్గం జిల్లా కేంద్రం లో నిర్వహించే జాతీయ సమైక్యత వజ్రోత్స వాలు అధికారులు అప్పగించిన  బాధ్యతలు సక్రమంగా  నిర్వర్తించి  విజయ వంతం చేయాలని అన్నారు.ఈ నెల 16 న నల్గొండ జిల్లా,నియోజక వర్గ కేంద్రం లో 15 వేల మందితో ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని,ఇందుకు గ్రామ,మండల వారీగా యువత,ప్రభుత్వ ఉద్యోగులు,మహిళలు, విద్యార్థులు జిల్లా కేంద్రం ర్యాలీ కి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని,ఇందుకు కావలసిన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.లక్ష్మి గార్డెన్ నుండి ఎన్.జి.కళాశాల వరకు ర్యాలీ వుంటుందని,ఎన్.జి.కళాశాల లో సమావేశం వుంటుందని అన్నారు.అక్కడే వారికి భోజనం ఏర్పాట్లు చేసేందుకు కౌంటర్ లు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సెప్టెంబర్17 న ముఖ్య అతిథి చే జాతీయ పతాక ఆవిష్కరణ వుంటుందని, అదే రోజు ఎస్.టి. ప్రజా ప్రతినిధులు,అధికారులు హైద్రాబాద్ లో ఎన్.టి.అర్.స్టేడియం లో జరిగే కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు బస్సు లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.18 న జిల్లా కేంద్రం లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అర్.డి. ఓ.జగన్నాథ రావు మాట్లాడుతూ శుక్రవారం రెవెన్యూ,ఎం.పి.డి. ఓ.లు,ఇతర అధికారులతో సమావేశం నిర్వహించినట్లు,శనివారం స్థానిక శాసన సభ్యులు సమావేశం నిర్వహించి  సమీక్షించి ట్లూ సెప్టెంబర్ 16,17, 18 వ తేదీలలో నిర్వహించే కార్యక్రమాల ఏర్పాట్లు పై వివరించారు.ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డి. ఈ. ఓ.బిక్షపతి,జిల్లా రవాణా అధికారి సురేష్ రెడ్డి నల్గొండ, కనగల్ , తిప్పర్తి ఎం.పి.డి. ఓ.లు,తహశీల్దార్ లు,రెవెన్యూ ,విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.