ఎడమ కాలువ గండికి చీమల పుట్టలే కారణం... మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుమానం

Submitted by venkat reddy on Wed, 21/09/2022 - 13:02
Ant nests are the cause of the left drain... Minister Jagadishwar Reddy suspects


-మూడు రోజుల్లో కాల్వకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల
ఫోటో రైటప్ ః ఎడమ కాలువ గండి పనులు పరిశీలిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల  జగదీశ్వర్ రెడ్డి
ఫోటో రైటప్ ః విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గుంతకండ్ల  జగదీశ్వర్ రెడ్డి

నిడమనూరు,సెప్టెంబర్20,(ప్రజాజ్యోతి): నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడడం దురదృష్టకరం గండికి కారణం పద్దికోక్కులు,చీమల పుట్టలే  ఉండవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల  జగదీశ్వర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఎడమ కాలువకు పడిన ప్రాంతాన్ని సందర్శించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ విధి వెక్కిరించి..సాగర్ ఎడమ కాల్వకు శాపంగా మారీ గండి పడడం వల్లన రైతులకు తీవ్ర నిరాశే మిగిల్చిందన్నారు. ఈనెల 07వతేదిన నాగార్జునసాగర్ ఎడమకాల్వకు 32.1 కిలోమీటర్ వద్ద సాయంత్రం 6.30నిమిషాలకు వేంపాడు సమీపంలోని (యూటి) అండర్ టన్నెల్ వద్ద గండిపడింది.కాల్వకట్ట సుమారు10-15 మీటర్ల మేర కోతకు గురై తెగిపోవడంతో కోట్లలల్లో నష్ట వాటిల్లిందన్నారు.అదేవిధంగా రైతులకు ఇబ్బంది కలుగకుండా ఒక్క ఎకరం పొలం కూడా నష్టంవాట్లికుండా ఉండడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు మేరకు గండి పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన  చేపట్టినట్లు తెలిపారు. ఎడమ కాలువ ప్రమాదం కాల్వ కట్ట అంచులు కాకుండా కాల్వ మధ్యలో గండి పడడం టెక్నికల్ గా అంచనా వేయలేక పోతున్నాము.కాలువకు గండి పడడానికి కారణం పందికొక్కులు కావచ్చు, చిమల పుట్టలే కావచ్చని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎడమ కాలువ పరిధిలోని నాగార్జున సాగర్ ,హుజూర్ నగర్  ,కోదాడ నియోజకవర్గ పరిధిలో కొందరు రైతులు ముద్దస్తుగా  వరిపంటలు సాగు చేశారు.ఈ వరి పంట పొలాలు పొట్ట దశలో ఉండి ఎండిపోవడం రైతులకు ఆందోళన కలిగించిందన్నారు. ఎడమ కాలువకు గండి పండినప్పటికిని గండి పూడ్చివేత పనులు 14రోజులు రాత్రి పగలు ఎన్నెస్పి అధికారులు ముమ్మరంగా మరమ్మత్తు పనులు యుధ్ధ ప్రాతిపదికన చేప్పటి గండి పూడ్చివేత పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు .గత రెండు రోజుల క్రితం ఎడమ కాలువకు మంగళవారం నీటిని విడుదల చేస్తామని  చెప్పిన మాట ప్రకారం మంగళవారం సాయంత్రం ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు.కాలువకు నీటిని విడతల వారిగా విడుదల చేస్తారు.మొదట 2వేల క్యూసెక్యూల నీటిని విడుదల చేశారు.అదేవిధంగా దశలవారీగా ఎడమ కాలువకు  రెండు రోజుల్లో  పూర్తిస్థాయిలో  నీటిని విడుదల చేసి చివరి భూములకు నీరు చేరేలా  నీటిని విడుదల చేయనున్నట్లు  మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో  నాగార్జునసాగర్, కోదాడ, హుజూర్ నగర్, శాసనసభ్యులు నోముల భగత్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్,సీఈ శ్రీకాంతరావు, ఎస్ఈ ధర్మనాయక్,డీఈఈ పరమేష్,ఈఈ రమేష్ ,డీఈ సంపత్ ,జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు, మాజీ ఎంపిపి హనుమంతరావు, ఎంపీపీ బొల్లం జయమ్మ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకతి వెంకటరమణ, పిఎసిఎస్ చైర్మన్ గుంటుక వెంకట్రెడ్డి,  తాటి సత్యపాల్,  మున్సిపల్ చైర్మన్ గౌరవ సలహాదారుడువెంపటి శంకరయ్య,కామెర్ల జానయ్య, సీనియర్ నాయకులు మర్ల చంద్రారెడ్డి,బొల్లం రవి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు పోలే డేవిడ్, యనమల సత్యం, దేవస్థాన చైర్మన్లు లింగప్ప, మేరెడ్డి వెంకట రమణ, కౌన్సిలర్ వర్ర వెంకటరెడ్డి, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చింతమల పాండురంగయ్య, బత్తుల సుజయ్ ,పరమేష్ ,తదితరులు,పాల్గొన్నారు.