సబ్సిడీ లు అన్నీ ఎత్తివేసి రైతు బంధు ఇస్తున్నారు

Submitted by Degala shankar on Thu, 22/09/2022 - 16:30
 All the subsidies have been removed and they are giving it to the farmer

ఫసల్ బీమా లో చేరని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 22, (ప్రజా జ్యోతి)  ../ గతంలో రైతుల అన్ని విధాలా సబ్సిడీ లు అందేవని, ఈ సబ్సిడీ లతో రైతులు మూడు కాలాలు పుష్కలంగా పంటలు సాగు చేశారని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ లు అన్నీ ఎత్తివేసి కేవలం రైతు బంధు పథకం అమలు చేస్తున్నారని దీనివల్ల రైతులకు ఒరిగిందేమీ లేదని వ్యవసాయం మరింత తగ్గిపోయిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రైతుబంధు పేరుతో రైతులను తీవ్రంగా మోసం చేస్తుందని రైతులు గ్రహించాలని పేర్కొన్నారు. ప్రజాగోష బీజేపీ భరోసా రెండవ విడత బైక్ ర్యాలీలో భాగంగా గురువారం జైనథ్ మండలంలోని మండలంలో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సర్కారు చేతకాని దివాలు కోరుతనం వల్ల కేంద్రం రైతులకు అందిస్తున్న ఫసల్ బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరని కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు ఒక్క రైతు బంధు ఇచ్చి మిగతా సబ్సిడీలు అన్నీ భీమాలు అన్ని ఎత్తివేసారని ఆయన పేర్కొన్నారు. మొదట్లోనే పసల్ బీమా లో ప్రభుత్వం చేరినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతులు మరింత అభివృద్ధి చెందేవారని మూడు కాలాలపాటు పుష్కలంగా పంటలను సాగు చేసేవారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు జైనథ్ మండలానికి చెందిన విద్యా వాలంటీర్లు కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఈటెల రాజేందర్ కు తమ సమస్యలను విన్నవిస్తూ ఒక వినతి పత్రం సమర్పించారు. అనంతరం అనేకమంది పలువురు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు నాయకులు కార్యకర్తలు బిజెపిలో చేరారు వీరందరికీ ఈటెల రాజేందర్ కండువాలు కప్పి పార్టీలోకించారు.

బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ నియోజకవర్గంలో రైతుల కృషి ఫలితంగానే రాష్ట్ర రైతాంగం కు పసల్ బీమా డబ్బులు వచ్చాయని అన్నారు. కెసిఆర్ మోసపూరిత పాలనను అంతం చేయాల్సిన సమయం దగ్గరపడిందన్నారు. రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు నాయకులు సమిష్టిగా పనిచేసే రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ ను మట్టికరిపించి బిజెపిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ఇప్పటినుంచే నడుం బిగించాలని కోరారు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డబ్బులు ఆశ చూపుతూ అనేక మోసపూరిత హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, రాష్ట్ర, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.