ఐలమ్మ పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం చీఫ్ విప్ వినయ్ భాస్కర్

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 11:44
 Ailamma's struggle is an inspiration for future generations Chief Whip Vinay Bhaskar

హనుమకొండ, సెప్టెంబర్26 (ప్రజాజ్యోతి)..//.. వీరనారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల)ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకుని హంటర్ రోడ్లోని ఆమె విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ ఐలమ్మ భూమి, భుక్తి, విముక్తి కోసం చేసిన అలుపెరుగని పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, బీసీ సంఘాల నాయకులు, రజక సంఘం ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.