నిడమనూరు హెచ్ పి పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్...???

Submitted by venkat reddy on Wed, 21/09/2022 - 13:05
adulterated petrol in Nidamanur HP petrol station...???


-వాహనదారులను పక్కకు తీసుకువెళ్లి బంకు యాజమాన్యం సెటిల్ మెంట్ 

-హెచ్ పి  పెట్రోల్ బంకును సీజ్ చేయాలని స్థానిక ప్రజలు ఆరోపణలు

నిడమనూరు, సెప్టెంబర్20(ప్రజాజ్యోతి):  పెట్రోల్ బంక్ లో ప్రెటోల్ కల్తీ జరుగుతున్న సంఘటన నిడమనూరు మండల కేంద్రంలో హెచ్ పి పెట్రోల్ బంకులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ప్రజలు, వాహనదారులు తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరు మండలకేంద్రంలోని హెచ్ పి పెట్రోల్ బంకులో ఓ వాహదారుడు అనుమానంతో   లీటరు పెట్రోల్ బాటిల్ లో కొట్టించాడు.వాహనదారులు వాహనాలలో పెట్రోల్ కొట్టిస్తే  వాహనాల్లో పెట్రోలు ఉన్నా కానీ వాహనాలు మోరాయించడంతో వాహనదారులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కల్తీ పెట్రోల్ వాహనాలల్లో నింపి వాహనదారులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇలా ప్రెటోల్ బంకులో పెట్రోల్ కల్తీ చేయడంసరియైనపద్దతికాదన్నారు.వెంటనేబాటిల్లోపెట్రోల్నింపిందిచూసిఅవాక్కయ్యాడు..ఇదేమిటండి బాటిల్ లో సగం పెట్రోల్ సగం నీరు కలిసినట్లు గుర్తించడంతో ఆ వాహనదారుడితో  బంక్ యాజమాన్యం  డీల్కుదుర్చుకున్నారు. ఇంత జరుగుతున్నా కానీ కనీసం తూనికలు, కొలతల , ఇంథన వనరుల శాఖ అధికారులు పట్టుకోకపోవడం సోచనీయమన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే హెచ్ పీ బంకులో తనిఖీ నిర్వహించి బంక్ యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలుకోరారు.