సినీ రంగంలో ఆదిలాబాద్ ఆదివాసి గిరిజన కళాకారులకు అవకాశం

Submitted by Degala shankar on Fri, 23/09/2022 - 12:08
Adilabad is an opportunity for tribal artistes in the film industry

ప్రముఖ సిటీ డైరెక్టర్ ఫయిం సర్కార్

ఫయిం సర్కార్ ను ఘనంగా సన్మానించిన గిరిజన కళాకారు

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 22, (ప్రజా జ్యోతి)../ రానున్న కాలంలో త్వరలో తన దర్శకత్వం లో నిర్మించబోయే సినిమాలలో ఆదిలాబాద్ జిల్లా కు చెందిన పలువురు ఆదివాసి గిరిజన కళాకారులకు మంచి అవకాశాలు కల్పిస్తామని కేంద్ర ప్రముఖ సినీ డైరెక్టర్ ఫయిం సర్కార్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో  ప్రముఖ సినీ డైరెక్టర్ ఫయిం సర్కార్ ను  ఇచ్చోడ మండలం దుబార్ పేట్ గ్రామానికి చెందిన ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం సభ్యులు శాలువాలతో ఘణంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు చాకటి తానుబాయి మాట్లాడుతూ   ఫయిం సర్కార్ అనేక సంవత్సరాలుగా  తమ సాంప్రదాయ గీతాలను, గొండి భాష లో, క్యాసెట్ రూపంలో ఎన్నో రాష్ట్రాలకు చేరేలా కృషి చేసిన ఒక గొప్ప వ్యక్తి అని, నేడు ఆయన తెలంగాణ సినీ, టెలివిజన్ కళాకారుల సేవా సంస్థ కు  రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎన్నిక కావడం చాలా ఆనందం గా ఉందని, భవిష్యత్తు లో మరెన్నో సినిమాలు తీయాలని, తమ ఆదివాసీ కళాకారులకు చక్కటి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఫయిం సర్కార్ మాట్లాడుతూ దేశం లో ఏ డైరెక్టర్ కూడా ఆదివాసీ గొండీ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబ జేసెలా ఏ ఒక్క సినిమా తీయ లేరని, కానీ తన రాబోయే సినిమా ఆదివాసీ గొండి భాష లోనే ఉంటుందని, అందులో నటించే ప్రతి ఒక్క నటుడు ఆదిలాబాద్ జిల్లా లోని ఆదివాసీ గిరిజన కళాకారులే ఉండబోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చాహకటి రాములు, ప్రధాన కార్యదర్శి కాత్లే శ్రీధర్, కార్యదర్శి  సెడ్మకి విజయ లక్ష్మి, సీనియర్ నటుడు అఫ్సర్ ఖాన్, సంఘ సేవకుడు సురికుంటి బ్రహ్మానందం రెడ్డి, సంతోష్  తది తరులు పాల్గొన్నారు.