బాలల న్యాయ చట్టంలో తీసుకు వచ్చిన సవరణల ప్రకారం జిల్లాలో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం" --- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు

Submitted by Kramakanthreddy on Fri, 23/09/2022 - 12:42
 According to the amendments brought in the Juvenile Justice Act, steps will be taken to enforce the law in the district." --- District Collector S. Venkatarao

 మహబూబ్ నగర్ సెప్టెంబర్ 22 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  గురువారం కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఇందివర పాండే బాలల న్యాయ చట్టంలో తీసుకువచ్చిన సవరణలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు.  గతంలో కుటుంబ న్యాయస్థానం ద్వారా మాత్రమే దత్తత తదితరాంశాలు ఉండేవని, ఇప్పుడు చట్టాన్ని సవరించి  అట్టి అధికారాలను జిల్లా కలెక్టర్లకి అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. సవరించిన చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్లు వ్యవహరించాలని సూచించారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాధలను ఆదుకునే విషయంలో కూడా జిల్లా కలెక్టర్లకు పూర్తిస్థాయిలో  అధికారం ఇచ్చినట్లు కేంద్ర కార్యదర్శి  తెలిపారు. అదేవిధంగా స్పాన్సర్షిప్ పథకం కింద అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని  2000 రూపాయలనుం డి  4 వేలకు పెంచినట్లు  ఆయన తెలిపారు. బాలల న్యాయ చట్టం, తల్లిదండ్రులను కోల్పోయిన అనాధలకు అందించే సహాయం, స్పాన్సర్ సిపి వంటి పథకాలు అన్నిటిని కలిపి మిషన్ వాత్సల్య పేరు మీద జిల్లా కలెక్టర్లకు అధికారులను ఇవ్వడం జరిగిందని ఆయన వివరించారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు మాట్లాడుతూ చట్టంలో సవరించిన మార్పులకు అనుగుణంగా బాలల న్యాయ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తామని, ముఖ్యంగా బాలల న్యాయ చట్టం పై ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,  జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జరీనా బేగం ,డిఆర్డిఓ యాదయ్య, డిఎస్పి రమణారెడ్డి తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.