అబద్దాలతోనే అధికారంలోకి వచ్చిన బిజెపి, కాంగ్రెస్‌.... పార్లమెంట్‌ ఎన్నికల్లో బిఅర్‌ఎస్‌దే విజయం... సెంట్రల్‌లో బిజెపికి బిఅర్‌ఎస్‌ మద్దతు ఉండదు... కవితకు భయపడి జైల్లో పెట్టారు... మీట్ ది ప్రెస్ లో బి అర్ ఎస్ అభ్యర్ధి బాజిరెడ్డి గోవర్దన్...

Submitted by SANJEEVAIAH on Fri, 10/05/2024 - 21:12
Photo

అబద్దాలతోనే అధికారంలోకి వచ్చిన బిజెపి, కాంగ్రెస్‌....

పార్లమెంట్‌ ఎన్నికల్లో బిఅర్‌ఎస్‌దే విజయం...

సెంట్రల్‌లో బిజెపికి బిఅర్‌ఎస్‌ మద్దతు ఉండదు...

కవితకు భయపడి జైల్లో పెట్టారు...

బిజెపి, కాంగ్రెస్‌లు రెండు ఒక్కటే...

నేను గెలిస్తే ప్రత్యేక నిజామాబాద్ లో అభివృద్ది...

‘‘మీట్‌ ది ప్రెస్‌’’లో బిఅర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌....

(నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా బ్యూరో - ప్రజాజ్యోతి ` ఎడ్ల సంజీవ్‌) 

కాంగ్రెస్‌ బిజెపిలు రెండు జోడు పార్టీలే. మా పార్టీ అధినేత చేప్పినట్లు పార్లమెంట్‌ ఎన్నికల్లో స్థానిక పార్టీలతే హవా ఉంటుంది. కాంగ్రెస్‌ డెబ్సై ఏళ్లలో బిజెపి పదేళ్లలో చేసింది శూన్యమే. కాంగ్రెస్‌ తప్పుడు గ్యారంటీలను చూపించి శాసన సభ ఎన్నికల్లో గెలిచింది. ఈ అయిదు నెలల్లో తప్పుడు వాగ్దానాలు అని ప్రజలు గ్రహించారు. పార్లమెంట్‌ ఎన్నికలలో బిఅర్‌ఎస్‌కే నిజామాబాద్‌ పార్లమెంట్‌ ప్రజలు పట్టం కడతారు అని నిజామాబాద్‌ పార్లమెంట్‌ బిఅర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ‘‘మీట్‌ ది ప్రెస్‌)లో పాల్గొని అయన మాట్లాడారు. ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు రామకృష్ణ, కార్యదర్శి బైర శేఖర్‌ అధ్యుక్షతన జరిగిన మీట్‌లో బాజిరెడ్డి గోవర్ధన్‌ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సవాదనంగా సమాధానం చెప్పారు. 

పంచరెడ్డి శ్రీకాంత్‌ (ఐ న్యూస్‌) : దేశవ్యాప్తంగా మోడీ హవా ఉంది కదా. ఈ తరుణంలో మీరు గెలుస్తామని ఏలా చెపుతున్నారు..?
బాజిరెడి గోవర్ధన్‌ : మోడీ హవా అంటు ఏమి లేదు. కొందరు దానిని అలా ప్రచారం చేస్తున్నారు. అవినీతి నిర్మూలన ముఖ్యం కాదు, కులం, మతం అంటు మత రాజకీయాలు చేస్తున్నారు. నిజామబాద్‌ ఎంపి అరవింద్‌ అయిదేళ్ల కాలంలో పార్లమెంట్‌లో ఒక్క సమస్యపై కూడా చర్చించలేదు. కనీసం ప్రస్తావించిన పాపాన పోలేదు. పార్లమెంట్‌ పరిధిలోని ఏ ఒక్క సమస్యను పరిష్కారించలేదు. పసుపు బోర్డు అని చెప్పి అయిదేళ్లు అయిన అది ముందుకు పడలేదు. గల్ఫ్‌ పాలసీని సంగతి వదిలేసారు. ప్రతినిత్యం గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తానని చెప్పి నామ మాత్రంగా పెట్టి చేతులు ఎత్తివేసారు. స్కీల్‌ డెవలప్‌మెంట్‌ అన్నారు. కానీ ఏ ఒక్క నిరుద్యోగికి స్కీల్‌పై శిక్షణ ఇవ్వలేకపోయారు. నియోజక వర్గంలోని షుగర్‌ ఫ్యాక్టరీలది అదే దారి. ఎన్నికల్లో ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది కాబట్టి పార్లమెంట్‌ నియోజక వర్గానికి ఏంతో చేయవచ్చు. చివరకు ఎంపి లాండ్స్‌ కూడా ఏం చేసారో ఎవరికి అర్ధ కాదు. కాని రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఅర్‌ఎస్‌ ఎమ్మెల్యేలో నియోజక వర్గాలలో ఏన్నో రకాలుగా రోడ్డు, భవనాలు, ప్రాజెక్టులను అభివృద్ది చేసాం. నేను డిచ్‌పల్లికి డీగ్రీ కళాశాల తీసుకువచ్చాను. ఒక ఐటిఐ ఏర్పాటు చేసారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు కేసీఆర్‌ అప్పు చేసాడని చెపుతున్నారు. చేసింది 3.50లక్షల కోట్లు అయితే 50 లక్షల కోట్ల అభివృద్ది చేసారు. అభివృద్ది గురించి మాట్లాడారు కానీ అప్పుల గురించి మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మోడిని నేను అడుగుతున్నా స్సీస్‌ బ్యాంక్‌ బ్లాక్‌ మనీ ఏమైంది. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఏవి.? 56 వేల కోట్లు ఉన్న అప్పు పదేళ్లలో వంద వేల కోట్లకు ఏలా పెరిగింది. హిందుయిజం పేరుతో యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. బిజెపి ఎంపిల, ఎమ్మెల్యేల పిల్లలు మాత్రం చదువుకుంటారు. విదేశాల్లో ఉంటు వ్యాపారాలు చేస్తారు. కానీ బిసిలు ఎస్సీల పిల్లలు మాత్రం రామజపం చేసుకుంటు రోడ్ల మీద జండాలు పట్టుకుంటు తిరగాలా. ఇదే బిజెపి తీరు.

విజ్ఞేష్‌ (సాక్షి టీవి) : నిజామాబాద్‌ ఎంపిగా గెలిస్తే పార్లమెంట్‌ అభివృద్దికి మీ ప్రణాళిక ఏమీటీ.?
బాజిరెడ్డి గోవర్ధన్‌ : నాకు నిజామాబాద్‌ జిల్లాపై పూర్తిగా పట్టు ఉంది. ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు ఆర్మూర్‌ అభివృద్ది కోసం ముఖ్యంగా రోడ్లు వేసాను. బాన్సువాడలో పని చేసా, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేగా రెండు సార్లు పని చేసాను. ముఖ్యంగా నకీలీ ఏజంట్ల వ్యవస్థను రూపుమాపీ, గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి వారి కోసం నైపుణ్యం కలిగిన శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తాను. వరంగల్‌ తరహాలో మోగా టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేస్తాను. ప్రజా అవసరాల నిమిత్తం కావాల్సిన ప్రతి పనిపై దృష్టి పెడతాను.

మండే మోహన్‌ (భారత్‌ టుడే టీవి) : మాజీ ఎంపి, ఎమ్మెల్సీ కవిత ఫోటో లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఏందుకు.Ñ
బాజిరెడ్డి గోవర్ధన్‌ : అది తప్పు. తప్పకుండా ఆమె ఫోటో ఉంది. ఆమె మా పార్టీ మహిళ నాయకురాలు. ప్రచార సారథి కూడా ఆమె లేకపోవడం మాకు కూడా పెద్దలోటు. బిజెపి ఎంపి అయిన అరవింద్‌ను ఈ ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసిన ఒడిస్తానని సవాల్‌ చేసారు. ఆమెకు బయపడి కవితపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. నాకు కవిత పూర్తి మద్దతు ఉంది. ఆమె సోషల్‌ మిడియా బృందాలు అన్ని నా కోసం ఇక్కడ పని చేస్తున్నాయి. ఆమె ఆదేశాల మేరకు పనులు కూడా చేస్తున్నాం. 

బోబ్బిలి నర్సయ్య (డిడి టీవి): పదేళ్లు అధికారంలో ఉండి బిఅర్‌ఎస్‌ జిల్లాకు కనీసం ఇంజనీరింగ్‌ కాలేజ్‌, మహిళ కాలేజ్‌ తెలేకపోయారని కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌ రెడ్డి అంటున్నారు. దీనికి మీ సమాధానం.?
బాజిరెడ్డి గోవర్ధన్‌ : 1981లో పంచాయతీ సమితి అధ్యక్షుడు చేసాడు జీవన్‌రెడ్డి. 1983లో వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసాడు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యేగా ఒడిపోయాడు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికి మళ్లీ ఎంపిగా పోటీ చేస్తున్నాడు. కుటుంబ సభ్యుల్లోని వారినే కౌన్సిలర్‌గా, ఎంపిటీసీగా, మున్సిపల్‌ చైర్మన్‌గా ఇలా ఎక్కడ ఏ పదవి ఉన్న అయన కుటుంబానికి లేదా బంధువులకు కావాలి అనుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆరుసార్లు ఎమ్మెల్యే రెండుసార్లు మంత్రిగా ఉండి ఏం చేసారో సమాధానం చెప్పమనండీ. స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బిసిలను ఎదగకుండా చేసిన చరిత్ర అయనది. పదేళ్ల బిఅర్‌ఎస్‌ జగిత్యాలను ఏంత అభివృద్ది చేసిందో అక్కడికి వెళితే తెలుస్తుంది. 
్‌
శ్రీనివాస్‌ (జనంసాక్షి) : పార్లమెంట్‌ స్థానంలో కీలకంగా ఉన్న మైనారిటీ ఓట్లు బిఅర్‌ఎస్‌కు వస్తాయా లేక ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది దీనిని ఏలా తీసుకుంటున్నారు.?
బాజిరెడ్డి గోవర్ధన్‌ : ఇటీవల ప్రియంకగాంధీ హైదరాబాద్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ బిజెపి ఏజంట్‌ అని చెప్పారు. ఈ సందర్భంలో ఎంఐఎం ఏటువైపు అనేది వాళ్లు తెల్చుకోవాలి. ఎంఐఎం లీడర్లు ఏం చెప్పిన మైనారిటీ నాయకులు, కార్యకర్తలు మొత్తం బిఅర్‌ఎస్‌ వెంటే ఉన్నారు. తప్పకుండా మైనారిటీలు అంతా బిఅర్‌ఎస్‌కు ఓటు వేస్తారు.

పాకాల నర్సింలు (ప్రజాపక్షం) : ప్రైవేటీకరణ పెరుగుతుండగా మరోవైపు నరేంద్రమోడీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్నారు. మీరేమంటారు.?
బాజిరెడ్డి గోవర్ధన్‌ : మీరు చెప్పినట్లు ఒకవైపు ప్రవేటీకరణ పెరుగుతుంది. కానీ ఇవేవి పట్టించుకోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీల, బిసిలను అణిచి వేస్తున్నారు. మరోపక్క రాజ్యంగాన్ని మారుస్తామని చెపుతున్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వేలను, ఎల్‌ఐసి ప్రైవేట్‌ అప్పగించే ప్రక్రియ చేస్తున్నారు. నిజానికి ప్రజల సంక్షేమం మరిచి బడా వ్యాపారులకు కట్టబెడుతుంది. 
మోడీ మాటలు నోటీ మాటలే తప్పా చేతలు కావు. 

శ్యాంకుమార్‌ (విజయక్రాంతి) : అమిత్‌షా కానీ రేవంత్‌రెడ్డి గానీ కాంగ్రెస్‌, బిజెపిల మధ్యనే పోటీ ఉందని చెబుతున్నారు. దీనికి మీరేమంటారు.?
బాజిరెడ్డి గోవర్ధన్‌ : బిజెపి, కాంగ్రెస్‌లు దోస్తులు. ఒకరికి ఒకరికి మద్య సయోద్య ఉంది, అందుకే అలా మాట్లాడుతారు. నిజానికి బిజెపిని ఎక్కువ స్థానాల్లో ఒడిరచింది బిఅర్‌ఎస్‌ మాత్రమే.

భూపతి (హెచ్‌ఎం టీవి) : బిజెపి, బిఅర్‌ఎస్‌ కలిసే పని చేస్తున్నయని చెపుతున్నారు. నిజమేనా.?
బాజిరెడ్డి గోవర్ధన్‌ : బిఅర్‌ఎస్‌ అధినేత కేసీఅర్‌ సొంత కూతురును జైలు పెట్టింది బిజెపి. అలాంటి పార్టీతో ఏలా కలిసి ఉంటారు. దేశంలో బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ తప్పుడు మాటలు చెప్పి అబద్దాలతో అధికారంలోకి వచ్చారు. ప్రజలు నమ్మి మోసపోయారు. అది ఇప్పటికే ప్రజలకు అర్ధం అయింది. కాబట్టి పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను బిఅర్‌ఎస్‌ అప్పగిస్తారు. 

రాజు (చట్టం) : జిల్లాలో వ్యవసాయం తర్వాత బీడీ పరిశ్రమ కీలకం. కానీ ఇప్పుడు పూర్తిగా తరలిపోతుంది. కార్మికులకు ప్రయత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తారు.?
బాజిరెడ్డి గోవర్ధన్‌ : బీడీ పరిశ్రమపై పూర్తి పట్టు ఉండటంతోనే కేసీఆర్‌ అధికారంలోకి రాగానే ప్రతి కార్మికురాలికి రూ.2 వేల ఆర్థిక సహాయం ప్రతినెల అందించారు. ఈసారి అధికారంలోకి వస్తే రూ.3 వేలు ఇచ్చే ఆలోచన ఉంది. కానీ కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేసి రూ.4 వేలు ఇస్తామంటే అటువైపు ఓటు వేసారు. వారి కోసం ప్రత్యామ్నాంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటాం. మొదటి నుంచి కాంగ్రెస్‌, బిజెపిలు కార్మికుల పట్ల చిన్నచూపుతోనే ఉన్నాయి.

యాసిన్‌(ఎ.దక్కన్‌) : బిజెపి మళ్లీ అథికారంలోకి వస్తే రాజ్యంగాన్ని మారుస్తాం అంటున్నారు. దీనిపై మీ కామెంట్‌.?
బాజిరెడ్డి గోవర్ధన్‌ : రాజ్యంగం అనేది వివిధ దేశాల్లోని రాజ్యాంగాలను పరిశీలించి కొత్తగా ఏర్పాడిన దేశాల్లో అమలు చేసుకుంటారు. అలాగే మన దేశ రాజ్యంగం కూడా రాసరు. దీనిని మార్చడం అంతా సులువు కాదు. అందుకే అసలు విషయం అర్థం చేసుకొని ప్రజలే బిజెపిని మారుస్తున్నారు. 

గంగాదాస్‌(లోకల్‌ టీవి) : బిఅర్‌ఎస్‌ గెలిస్తే సెంట్రల్‌లో బిజెపికి మద్దతు ఇస్తుందని మైనారిటీలలో ప్రచారం ఉంది.
బాజిరెడ్డి గోవర్ధన్‌ : బిజెపికి మద్దతు ఇచ్చేది లేదు. ఒక విషయాన్ని గమనించాలి. ఓట్ల కోసమే ఈ తప్పుడు ప్రచారం మాత్రమే. మైనారిటీలు బిఅర్‌ఎస్‌ను కాదని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే పరోక్షంగా అది బిజెపి మేలు చేస్తుంది. కాబట్టీ మైనారిటీలు బిఅర్‌ఎస్‌కే ఓటు వేస్తారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేసారో బిజెపి చెప్పాలి. కానీ బిఅర్‌ఎస్‌ రాష్ట్రంలో రూ.2 వేల కోట్లతో ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. నేను పక్క సెక్యులర్‌వాదిని. జీవన్‌రెడ్డి పేరుకే సెక్యులర్‌. గత ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి అరవింద్‌కు మద్దతు ఇచ్చారు. అయనే మొన్న మీటింగ్‌లో ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. కాబట్టి ఎప్పటికి బిజెపికి బిఅర్‌ఎస్‌ మద్దతు ఉండదు.

బి.శేఖర్‌ (టీవి5) : పార్లమెంట్‌ పరిధిలోని మూడు షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని కాంగ్రెస్‌, బిజెపిలు చెపుతున్నాయి. వీటిపై బిఅర్‌ఎస్‌గా మీ ఎజండా ఏమిటీ.?
బాజిరెడ్డి గోవర్ధన్‌ : 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌, టీడీపీ, బిజెపిలు ఫ్యాక్టరీల విషయంలో హామీ ఇస్తునే వస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ఒక్క అడుగు ముందుకు పడలేదు. కేసీఆర్‌ ప్రత్యేకంగా కమిటీ వేసి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు ఫ్యాక్టరీలు సందర్శించడం జరిగింది. దీనిపై ప్రత్యేక నివేదిక ఇచ్చాం. కానీ ప్రైవేట్‌ వ్యక్తి కారణంగా కొంత జాప్యం జరిగింది. అలాగే రైతులే నడుపుకోవాలని అందుకే అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని కేసీఆర్‌ చెప్పారు. కానీ రైతులు ముందుకు రాలేదు.