చేనేత వృత్తి పై విధించిన జీఎస్టీ ని వెంటనే తొలగించాలని ప్రధాని కి ఉత్తరం. మేడారపు సుధాకర్

Submitted by lenin guduru on Wed, 26/10/2022 - 13:23
సుధాకర్

చేనేత వృత్తి పై విధించిన జీఎస్టీ ని వెంటనే తొలగించాలని ప్రధాని కి ఉత్తరం

తెలంగాణ రాష్ట్ర సమితి యువజన నాయకులు మేడారపు సుధాకర్

 

పాలకుర్తి, అక్టోబర్ 25, ప్రజాజ్యోతి: 

చేనేత ముడిసరుకులు, ఉత్పత్తుల  మీద కేంద్ర బీజేపీ ప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే తొలగించాలని మంత్రులు కేటీఆర్,  ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మంగళవారం కే.యు జేఏసీ వైస్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమితి యువజన నాయకులు మేడారపు సుధాకర్ పోస్ట్ కార్డ్ రాసి నిరసన తెలిపారు.
చేనేత కళాకారులు అందరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదలు, బలహీన వర్గాల వారని,
చేనేత పరిశ్రమ చేనేత కళాకారుడి నైపుణ్యత, సృజనాత్మకత, కష్టంపై ఆధారపడి మనుగడ సాధిస్తున్నదని, చేనేత కళాకారుడిలో వ్యాపార దృక్పథం ఏ కోశానా లేదని
చేనేత వృత్తి వ్యాపారం కాదని దేశ వారసత్వ కళా సంపద అని ఈ పోస్ట్ కార్డ్ లో ప్రధాని కి తెలియజేశారని అన్నారు.
దేశ స్వాతంత్ర సంగ్రామంలో చేనేత వృత్తి ప్రాముఖ్యత దేశవాసులకు తెలిసిందేనని,
కేంద్ర ప్రభుత్వం చేనేతకు వాడే ముడి సరుకులపై చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ విధించి దాన్ని 12% కు పెంచాలనుకోవడం చేనేత కార్మికుల పాలిట ఉరితాడు అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని,
తక్షణమే మీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం విధించిన చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీని వెంటనే తొలగించాలని చేనేత కార్మికుల పక్షాన కోరామని  సుధాకర్ తెలిపారు.