యూనివర్సిటీ బోర్డు తప్పిదం 33 మంది విద్యార్థులు ఫెయిల్ ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేయాలి

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 13:21
33 students failed due to university board's mistake   Failing students should be passed

ఎస్ఎఫ్ఐ ధర్నా రాస్తారోకో

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి): కాకతీయ యూనివర్సిటీ బోర్డు తప్పిదం వల్ల మానుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల 6 సెమిస్టరు పరీక్షకు హాజరైన హాజరుకాలేదని 33 మంది విద్యార్థులను  ఫెయిల్ చేశారని ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ముందు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ బోర్డు తప్పిదం వల్ల 33 మంది విద్యార్థులు తాము రాసిన పరీక్షలో ఫెయిల్ అయ్యారని దీనికి బోర్డు బాధ్యత వహించాలని వారన్నారు. ఫెయిలైన విద్యార్థులను ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ  జిల్లా  అధ్యక్ష కార్యదర్శులు లవిశెట్టి ప్రసాద్  కేలోత్ సాయి కుమార్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ సూర్యప్రకాష్, పట్టణ నాయకులు  ప్రవీణ్,బానోత్ ఉపేందర్  చంటి, రాజేష్, సాగర్   పిడిఎస్యు నాయుకులు మధు, నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.