ఈనెల 11న వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ మహాసభ విజయవంతం చేయాలి

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 15:31
On 11th of this month, the agricultural labor union's town convention should be successful
  • దండెంపల్లి సరోజ

నల్లగొండ సెప్టెంబర్ 08,(ప్రజాజ్యోతి)తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ పట్టణ మహాసభ సెప్టెంబర్ 11 ఆదివారం దొడ్డి కొమురయ్య భవన్లో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సరోజ తెలిపారు.గురువారం మహాసభల ప్రచార కార్యక్రమం పట్టణంలోని 11వ వార్డు అర్బన్ కాలనీలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ పట్టణంలో గ్రామాలు విలీనం చేసిన తర్వాత పనులు లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని, కనీస కూలి రోజుకు 600 రూపాయలు నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంఘం ఆధ్వర్యంలో అనేక ఆందోళన చేస్తున్నామని తెలిపారు.ఈ మహాసభలో పట్టణ  ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలని మరియు పట్టణ పేదలకు ఇండ్లు,పెన్షన్లు,రేషన్ కార్డులు ఇవ్వాలని మహాసభలో చర్చించి పోరాట కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ మహాసభకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారీ ఐలయ్య,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డి లు ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు.

పట్టణంలోని అన్ని వార్డులలో వ్యవసాయ కార్మికులందరూ అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు యాదమ్మ, జానమ్మ, వెంకటమ్మ,భవాని, బక్కమ్మ, చిట్టెమ్మ , లింగమ్మ, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.