గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలి

Submitted by kareem Md on Wed, 14/09/2022 - 16:14
10 percent reservation should be given to tribals
  •  జిల్లా కార్యదర్శి కోర్ర శంకర్ నాయక్
  • ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజన విద్యార్థి సంఘం.

హలియా,సెప్టెంబర్(ప్రజా జ్యోతి) : గిరిజనుల జనాభా  ప్రకారం తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి వెంటనే పంపాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోర్ర శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం 
హాలియా మున్సిపాలిటీలో తెలంగాణ గిరిజన సంఘం అనుముల మండల కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులకు 10 రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గిరిజనులకు జనాభా శాతం ప్రకారం ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లు 12 శాతం కల్పిస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ పదేపదే  చెప్పి గిరిజన నిరుద్యోగులను రెచ్చగొట్టి ఉద్యమంలో పాల్గొని అనేకమంది గిరిజన నిరుద్యోగులు యువకులు అమరులయ్యారని తెలిపారు. అధికారం చేపట్టి ఎనిమిది ఎండ్లు పూర్తయిన రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు కల్పిస్తానన్న రిజర్వేషన్ కల్పించాలని కోరారు. రిజర్వేషన్లు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.

ఇప్పటికే గిరిజన విద్యార్థులు, నిరుద్యోగులు,విద్యా ఉద్యోగాలలో చాలా నష్టపోయారని గుర్తు చేశారు. తెలంగాణలో సుప్రీంకోర్టు సూచన మేరకు 50 శాతం రిజర్వేషన్ దాటితే కేంద్ర ప్రభుత్వం అనుమతితో రిజర్వేషన్ ఇవ్వాలనే తీర్పుకు అనుగుణంగా కేంద్రంపై సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ గిరిజనులకు ఇవ్వాలని తీర్మానం అసెంబ్లీలో చేసి కేంద్రానికి పంపి రిజర్వేషన్ వచ్చేంతవరకు పోరాటం చేయాలని అన్నారు. దేశంలో రాష్ట్రంలో గిరిజనులకు రావలసినటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులు సబ్ ప్లాన్ నిధులు,ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ చాలా నష్టపోతున్నారని అన్నారు. హక్కుల కోసం గ్రామస్థాయిలో గిరిజన ప్రజలు ఉద్యమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. 10 శాతం రిజర్వేషన్ వచ్చేంతవరకు పెద్ద ఎత్తున పోరాటం చేపడుతామన్నారు ఈ పోరాటంలో గిరిజన ఉద్యోగులు,విద్యార్థులు మేధావులు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు రమావత్ నరేష్ నాయక్,అనుముల మండల అధ్యక్ష కార్యదర్శులు సపావట్ శివ నాయక్,అశోక్ కుమార్ నేనావత్,చంటి,హరికృష్ణ, లాలూ,చరణ్,బీమా, తదితరులు పాల్గొన్నారు