ఘనంగా గాంధీ, శాస్త్రిజీ జయంతి వేడుకలు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:32
 Grand celebrations of Gandhi and Shastriji Jayanti

హనుమకొండ, అక్టోబర్02 (ప్రజాజ్యోతి),../, జాతిపిత మహత్మా గాంధీజీ, భారత దేశ మాజీ ప్రధాని స్వర్గీయ లాల్‌ బహదూర్‌ శాస్త్రిజీ జయంతి వేడుకలను పురస్కరించుకొని  ఆదివారం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హన్మకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి మహత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి నేతల చిత్రపటాలకు పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన గొప్ప నాయకుడు, అహింసాయుత మార్గంలోనే ఆయన సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 
గడగడలాడించాడని అన్నారు. అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటిన మహాత్ముడు గాంధీజీ ఆయన కలలు కన్న భారతదేశ నిర్మాణంలో పునరంకితం కావటానికి జయంతి వేడుకలు ప్రేరణగా నిలుస్తాయన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి బలమైన దేశాన్ని నిర్మించడానికి స్తంభాలుగా స్వీయ పోషణ, స్వావలంబన ఆవశ్యకతను గుర్తిస్తూ జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడని, తీవ్రమైన ఆహార కొరతను అధిగమించడానికి, దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించాలని శాస్త్రి నిపుణులను కోరారని తెలిపారు. ఇది ప్రసిద్ధ హరిత విప్లవంకి నాంది అయిందని, 1965 భారత్ పాకిస్థాన్ యుద్ధం సందర్భంగా ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, సంకల్పం, దీక్షా దక్షతలను ఎంత చెప్పుకున్నా తక్కువే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పి. సిరిసిల్ల రాజయ్య, టిపిసిసి సభ్యులు నమిండ్ల శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు బొమ్మతి విక్రమ్, గ్రేటర్ మైనారిటీ సెల్ చైర్మన్  మహమ్మద్ అజీజుల్లా బేగ్, వరంగల్ వెస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అంకుస్, బొంత సారంగం, సయ్యద్ అజ్గర్, అరూరి సాంబయ్య, గుంటి స్వప్న, సమత, డివిజన్ అధ్యక్షులు జన్ను సుధాకర్, మొహమ్మద్ జాఫర్, బంక సతీష్ యాదవ్, సింగారపు రవి ప్రసాద్ బి.శ్రీధర్ యాదవ్,  గజపాక రమేష్, వల్లపు రమేష్, తక్కలల్లి మనోహర్, మొహమ్మద్, అజ్గర్, మాజీ డివిజన్ అధ్యక్షుడు సాయిరాం యాదవ్, తాళ్లపల్లి మేరీ, ఓబీసీ నాయకుడు బొమ్మతి రాకేష్ , మాజీ సర్పంచ్ జన్ను అభిషేకం, పాలడుగుల ఆంజనేయులు, ఫ్రాన్సిస్ రెడ్డి , నాగపురి లలిత తదితరులు పాల్గొన్నారు.