రాఘవ హైస్కూల్ లో వందశాతం ఉత్తీర్ణత ...: పదో తరగతి ఫలితాల్లో ఆర్ హెచ్ ఎస్  ప్రభంజనం

Submitted by SANJEEVAIAH on Wed, 10/05/2023 - 18:09
ఫోటో

రాఘవ హైస్కూల్ లో వందశాతం ఉత్తీర్ణత

* పదో తరగతి ఫలితాల్లో ఆర్ హెచ్ ఎస్  ప్రభంజనం
* ఫలితాలపై  చైర్మన్ ప్రవీణ్ కుమార్ హర్షం
* విద్యార్థుల తల్లితండ్రుల సంబరం
* ఉపాధ్యాయులకు ప్రశంస

నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లోగల రాఘవ హైస్కూల్ (ఆర్ హెచ్ ఎస్) పదో తరగతి ఫలితాల్లో రికార్డు సృష్టించింది. ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. నూతన యాజమాన్యం అధ్వర్యంలో కొనసాగుతున్న   రాఘవ హైస్కూల్, తొలి ఏడాది ఫలితాల్లోనే వంద శాతం ఉత్తీర్ణత సాధించడం, రికార్డు ఫలితాల ప్రభంజనం సృష్టించడం విశేషం. దీంతో రాఘవ హైస్కూల్  పేరు, విద్యార్థుల్లో మరింత  మార్మోగుతోంది. ఈ సందర్భంగా రాఘవ హైస్కూల్ ఛైర్మన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ....ప్రణాళిక ప్రకారం విద్యను అందించడమే తమ విజయ రహస్యమని తెలిపారు. ప్రతి విద్యార్థిలోని బలాలు, బలహీనతలు గుర్తించి, ప్రత్యేక అవగాహనతో బోధన చేయడమే తమ పాఠశాల గొప్పతనమని వివరించారు. ప్రతి ఉపాధ్యాయుడికి కొందరు విద్యార్థులను కేటాయించి, వారందరు ఉత్తీర్ణత సాధించేలా, ఉపాధ్యాయులకు బాధ్యతలు ఇవ్వడంతోనే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాఠాలు భోధించడంతోనే, వంద శాతం ఉత్తీర్ణత సాధించామన్నారు.  విద్యార్థుల్లో దాగున్న నైపుణ్యాలను వెలికితియమే, రాఘవ హైస్కూల్ తొలి ప్రాధాన్యతనని చెప్పారు. ఐఐటి, నీట్ పరీక్షలకు ముందునుంచే అవగాహన కల్పిస్తూ, లోతైన పాఠ్యాంశ విశ్లేషణలతో బోధిస్తున్నామని వివరించారు. సౌత్ ఇండియాలోనే తొలిసారిగా త్రీడీ యానిమేషన్  బోధనకు శ్రీకారం చుట్ట బోతున్నామన్నామని, ప్రీ ప్రైమరీ విద్యార్థులను ఇదెంతో ఆకట్టుకుంటుందన్నారు. వంద శాతం ఉత్తీర్ణత ఫలితాల సాధనలో, తమ ఉపాధ్యాయుల కష్టం వెలకట్టలేనిది పొగిడారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సహకారంతోనే ఉత్తమ ఫలితాలు పొందామన్నారు. అందరి సహకారంతో భవిష్యత్తులో ఇలాంటి ఘనతలు మరిన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.