అభినవ్ యూత్ పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు అందజేత
భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి)./...అభినవ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ మద్దెలమ్మ దేవి దేవస్థానంలో మరియు పద్మనగర్ దుర్గా కమిటీ దగ్గర ఆదివారం రోజున అమ్మవారు శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అవతారంలో దర్శనమిస్తున్న సందర్భంగా యువజన సంఘం ఆధ్వర్యంలో పిల్లలకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు రుద్ర చెన్నకేశవులు కమిటీ సభ్యులు పోచంపల్లి అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్నాటి బాలసుబ్రమణ్యం యూత్ అధ్యక్షులు గణేష్ కుమార్ ఉపాధ్యక్షులు జోగు రవీందర్ కోశాధికారి బాలరాజు సహాయ కోశాధికారి లింగస్వామి ,బాలకృష్ణ పద్మ నగర్ దుర్గ కమిటీ సభ్యులు కాలనీ వాసులు కరుణాకర్, శేఖర్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
- 2 views