మహబూబాబాద్

అనుమానమే పెనుభూతమై భార్యను అతి కిరాతకంగా చంపిన భర్త

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 14:08

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి): అనుమానంతో భార్యను నడిరోడ్డుపై కత్తితో  గొంతు కోసి అతి కిరాతకంగా చంపిన ఘటన మహబూబాబాద్  జిల్లాలో గురువారం కలకలం రేపింది.   సీఐ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక భవాని నగర్ తండాకు చెందిన జాటోత్ భాస్కర్ కల్పన దంపతులకు ముగ్గురు కూతుర్లు. భాస్కర్ మాంసం దుకాణంలో గుమస్తాగా పనిచేస్తుండగా, కల్పన పలువురి ఇండ్ల ల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్యపై అనుమానం కారణంగా భాస్కర్  కల్పన ల మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణ లు జరుగుతున్నాయి.

పత్తి,వరి పంటలను పరిశీలించిన ఏ ఈ ఓ రామకృష్ణ .

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 13:29

 నర్సింహుల పేట సెప్టెంబర్ 22 ప్రజా జ్యోతి,..//   పత్తి, వరి పంటలను పరిశీలించిన ఏ ఈ ఓ రామకృష్ణ. మండలంలోని రామన్నగూడెం లోని పత్తి మరియు వరి పంటలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ  ప్రస్తుతం వివిధ పంటల్లో కనిపిస్తున్న చీడ పిడలు నివారణ చర్యలపై  మాట్లాడుతూ 

మహబూబాబాదులో చికెన్ సెంటర్ ప్రారంభించిన పట్టణ తెరాస యువజన అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 13:17

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి):  మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 18వ వార్డ్ సూర్య థియేటర్ పక్కన యశోద చికెన్ సెంటర్ ని తెరాస యువజన అధ్యక్షులు మరియు  తాడు జిల్లా అధ్యక్షులు యాళ్ల మురళీధర్ రెడ్డి  గురువారం ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో  పిఏసిఎస్ డైరెక్టర్ బూర్ల ప్రభాకర్ ,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శేషారెడ్డి , 5వ వార్డ్  తెరాస పార్టీ అధ్యక్షుడు మద్దెల వెంకన్న,తెరాస నాయకుకు హుస్సేన్ నాయక్, 4వ వార్డ్ యువజన అధ్యక్షుడు దేవేందర్ నాయక్,అరెళ్లి రాజయ్య మరియు ముఖ్య నాయకులు యూత్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 13:14

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి): మహబూబాబాద్ జిల్లాకేసముద్రం మండలంలోని హరిహర గార్డెన్స్ లోగురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్  పాల్గొని చిరు వ్యాపారులకు, రైతు రుణాలకు సంబంధించిన లబ్ధిదారులకు 30 లక్షలు విలువచేసే చెక్కులను  పంపిణీ చేయడం జరిగింది.  ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెఫెడ్ డైరెక్టర్ మర్రి రంగా రావు, నజీర్ అహ్మద్, కముటం శ్రీను, దుర్గేష్, యాళ్ల మురళీధర్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు మరియు తదితరులు ఉన్నారు.

మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ. మహబూబాబాద్, డిఎఫ్ ఓ, నాగమణి

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:41

   కొత్తగూడ సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి ) ,,../ మత్స్యకారుల ఆర్థికా అభివృద్ధి కోసమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని ,  మహబూబాద్ జిల్లా డిఎఫ్ఓ నాగమణి అన్నారు. బుధవారం కొత్తగూడ మండలంలోని పోగుళ్లపల్లి, మొoడ్రాయి గూడెం , మోకాళ్లపల్లి, గ్రామపంచాయతీ పరిధిలోగల చెరువులకు, పోగుళ్లపల్లికి 215000 చేప పిల్లలు, మొడ్రాయిగూడెం గ్రామ పంచాయతీకి 100000 చేప పిల్లలను పంపిణీ చేశారు.

మహబూబాబాద్ ప్రెస్ క్లబ్ పనులను పరిశీలించిన మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:37

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి):  మహబూబాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ యొక్క పునరుద్ధరణ పనులను మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్  బుధవారం పరిశీలించి శిథిలావస్థలో ఉన్న వాటిని మున్సిపల్ జేసీబీతో తొలగించి పనులు పరిశీలించి త్వరలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ కు ఆఫీస్ లో గలా టేబుల్ మరియు కుర్చీలు బహుకరిస్తాను  హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సభ్యులు పాల్గొన్నారు

గ్రామ పంచాయితీ రికార్డ్ లను పరిశీలించిన ఎం పి ఒ..

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:33

మహ ముత్తారం ప్రజా జ్యోతి న్యూస్ సెప్టెంబర్ 21: మహా ముత్తారం మండలం ములుగు పల్లి గ్రామ పంచాయతీని ఎం పి ఓ మల్లికార్జున రెడ్డి సందర్శించి పంచాయతీ రికార్డులను పరిశీలించారు. గ్రామములో జరిగిన అభివృద్ధి పనులను చూశారు పలు అంశాలపై సూచనలు సలహాలు యివ్వడం జరిగినది.నూతనంగా గ్రామ పంచాయతీ కి వచ్చిన ఎం పి ఓ మల్లి కార్జున రెడ్డి ని సర్పంచ్ దూలం మల్లయ్య గౌడ్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి శాలువా తో సన్మానించారు..