నాగారం

డి.ఎస్.పి సంఘీభావ పాదయాత్ర

Submitted by Upender Bukka on Sat, 17/09/2022 - 11:16

నాగారం  ప్రజా జ్యోతి సెప్టెంబర్ 16.  ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల రాజ్యాధికారం కొరకై డాక్టర్ శారదన్ మహారాజ్ చేపట్టిన పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ఆరు నెలలు పాటు 3500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యాత్రకు మద్దతుగా శుక్రవారం డి.ఎస్.పి నాగారం మండల కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో జే త్రీ జిల్లా కోఆర్డినేటర్ విజయరామరాజు, మహారాజ్ డిఎస్పీ మండల అధ్యక్షులు భాస్కర్ మహారాజ్, ఉపాధ్యక్షులు నాగార్జున మహారాజ్ మండల కార్యదర్శి నాగరాజు, శ్రీనివాస్ మహారాజ్, కోశాధికారి లక్ష్మణ్ మహారాజు, తిరుపతి మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధున్ని సన్మానించిన మందుల సామెల్

Submitted by Upender Bukka on Sat, 17/09/2022 - 11:10

నాగారం ప్రజా జ్యోతి  సెప్టెంబర్ 16. తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ,సీఎం కేసీఆర్ 16, 17, 18 తేదీలలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. అందులో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ నాగారం మండల కేంద్రానికి చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు గుంటకండ్ల పిచ్చిరెడ్డిని హైదరాబాదులో పూలమాల వేసి శాలువాతో ఘనంగా  సన్మానించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.సాయుధ రైతంగ పోరాట యోధులను సన్మానించుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు.

విద్య వాలంటీర్లకు వేతనాలు అందజేత

Submitted by Upender Bukka on Fri, 16/09/2022 - 11:40

నాగారం ప్రజా జ్యోతి 15సెప్టెంబర్  . రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాతృమూర్తి గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగారం మండలంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యా వాలంటరీగా పనిచేస్తున్న రవినా కు రెండు నెలల వేతనాన్ని జగదీశ్ రెడ్డి తండ్రి చంద్రారెడ్డి, వైస్ ఎంపిపి మనిమాల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి మల్లయ్య, ఉపాధ్యాయులు వెంకట మల్లు, వీరేష్ పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు విజయవంతం చేయండి.

Submitted by Upender Bukka on Fri, 16/09/2022 - 11:05

నాగారం సెప్టెంబర్ 15 ప్రజా జ్యోతి.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం శుక్రవారం తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవాల మహా ర్యాలిని ఉదయం 9 గంటలకు తుంగతుర్తి మైనార్టీ స్కూల్ నుండి  ప్రారంభమై అంబేద్కర్ , తెలంగాణ తల్లి  జ్యోతిరావు పూలే చౌరస్తాల  మీదుగా సీతా రామచంద్రస్వామి దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించబడునని  నాగారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ హాజరవుతారని పేర్కొన్నారు.

పిల్లలను నులిపురుగుల భారీ నుండి కాపాడుకోవాలి. సర్పంచ్

Submitted by mahesh yadhav on Fri, 16/09/2022 - 10:21

నాగారం సెప్టెంబర్ 15(ప్రజా జ్యోతి). రాష్ట్ర ప్రభుత్వం చిన్నపిల్లలలో నులిపురుగుల నివారణకు అందించే మాత్రలను సద్వినియోగం చేసుకొని పిల్లలను నులిపురుగుల బారిన పడకుండా కాపాడుకోవాలని ఈటూరు గ్రామ సర్పంచ్ పేరాల సరిత యాదగిరి అన్నారు. గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాలు లోపు పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయాలని సూచించారు.

పిల్లలను నులిపురుగుల భారీ నుండి కాపాడుకోవాలి. సర్పంచ్

Submitted by mahesh yadhav on Thu, 15/09/2022 - 15:30

నాగారం సెప్టెంబర్ 15(ప్రజా జ్యోతి).   రాష్ట్ర ప్రభుత్వం చిన్నపిల్లలలో నులిపురుగుల నివారణకు అందించే మాత్రలను సద్వినియోగం చేసుకొని పిల్లలను నులిపురుగుల బారిన పడకుండా కాపాడుకోవాలని ఈటూరు గ్రామ సర్పంచ్ పేరాల సరిత యాదగిరి అన్నారు. గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాలు లోపు పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయాలని సూచించారు.

విద్యార్థులు మాతృభాషతో పాటు జాతీయ భాష నేర్చుకోవాలి

Submitted by Upender Bukka on Thu, 15/09/2022 - 11:09

నాగారం ప్రజా జ్యోతి 14 సెప్టెంబర్ ..  విద్యార్థులు మాతృభాషతో పాటు జాతీయ భాష పై పట్టు సాధించాలని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ అన్నారు. హిందీ భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని పసునూరు మోడల్ పాఠశాలలో హిందీ భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా ప్రిన్సిపాల్  మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి, ఉన్నత శిఖరాలకు చేరుకొని కన్న తల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో హిందీ భాషా ఉపాధ్యాయుడు నాగరాజు శ్రీనివాస్ రాజేందర్ కార్తీక్,  విద్యార్థులు  పాల్గొన్నారు.

కల్లుగీత కార్మికుల సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

Submitted by Upender Bukka on Wed, 14/09/2022 - 16:36

ప్రజా జ్యోతి నాగారం 14.   ఈనెల 29న సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నేమ్మికల్ గ్రామంలో శుభం ఫంక్షన్ హాల్ లో జరిగే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రెండవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లకొండ వెంకటేశ్వర్లు కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.....

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన నాగారం తహసిల్దార్

Submitted by Upender Bukka on Wed, 14/09/2022 - 16:24

ప్రజా జ్యోతి నాగారం 14 సెప్టెంబర్  . నాగారం మండలానికి చెందిన బంగ్లా వీఆర్ఏ ఎల్క సల్మాన్ పెద్ద కుమారుడు ఎల్క సురేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నాగారం మండలం తహసిల్దార్ హరిచంద్ర ప్రసాద్ మృతుడి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించి కుటుంబాన్ని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో రమేష్, సురేష్, అశోక్, సరిత, కల్పన ,శోభన్, పురుషోత్తం, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మాజీ మంత్రి రాం రెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలు

Submitted by Upender Bukka on Wed, 14/09/2022 - 16:12

ప్రజా జ్యోతి నాగారం 13 సెప్టెంబర్ .తుంగతుర్తి నియోజకవర్గం లోని నాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోడుసు లింగయ్య ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... తుంగతుర్తి శాసనసభ్యులుగా తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని తెలిపారు.వచ్చే శాసనసభ ఎన్నికలలో సూర్యాపేట నియోజకవర్గం నుండి రాం రెడ్డి దామోదర్ రెడ్డి గెలుపు ఖాయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త దామోదర్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని కోరారు.