పిల్లలను నులిపురుగుల భారీ నుండి కాపాడుకోవాలి. సర్పంచ్

Submitted by mahesh yadhav on Fri, 16/09/2022 - 10:21
 Children should be protected from worm infestation. Sarpanch

నాగారం సెప్టెంబర్ 15(ప్రజా జ్యోతి). రాష్ట్ర ప్రభుత్వం చిన్నపిల్లలలో నులిపురుగుల నివారణకు అందించే మాత్రలను సద్వినియోగం చేసుకొని పిల్లలను నులిపురుగుల బారిన పడకుండా కాపాడుకోవాలని ఈటూరు గ్రామ సర్పంచ్ పేరాల సరిత యాదగిరి అన్నారు. గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాలు లోపు పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నజియా టీచర్లు కృష్ణవేణి, వీణ ఏఎన్ఎం కలమ్మ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.