నాగారం

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

Submitted by Upender Bukka on Wed, 14/09/2022 - 12:44

నాగారం ప్రజా జ్యోతి 13సెప్టెంబర్ .మామిడిపల్లి గ్రామానికి చెందిన దుస్స నర్సయ్య, పుల్లమ్మ  భార్యాభర్తలు ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు.   నరసయ్యకు ముగ్గురు కుమార్తెలు కావడంతో  ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబం గురించి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ  గ్రామ అద్యక్షులు అంబటి శ్రీనివాస్ మంగళవారం పదివేల రూపాయలను, అరకింట బియ్యంను పార్టీ తరఫున అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....... తల్లిదండ్రులను  కోల్పోవడంతో  కుటుంబం ఆర్థికంగా చితకపోవడం బాధాకరమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.

అసెంబ్లీ తీర్మానం హర్షనీయం

Submitted by Upender Bukka on Wed, 14/09/2022 - 12:30

నాగారం ప్రజా జ్యోతి 13 సెప్టెంబర్ .ప్రపంచ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును కేంద్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి  పెట్టాలని మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షనీయమని టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిలుకూరి చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ....... నూతన పార్లమెంటు భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ భవనముగా మార్చి ఆ మహనీయునికి అంకితం చేయాలని తెలిపారు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Submitted by Upender Bukka on Tue, 13/09/2022 - 10:44

నాగారం ప్రజా జ్యోతి 12 సెప్టెంబర్ ; సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేరబోయిన గూడెం గ్రామ సర్పంచ్ స్వరూప ప్రశాంత్ అన్నారు. సోమవారం తెలంగాణ సాంస్కృతిక బృందం ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  గ్రామ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు .వర్షాకాల కావడంతో డెంగ్యూ ,మలేరియా, డయేరియా ,లాంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్య క్రమంలో వార్డు మెంబర్ కంచుగట్ల లింగయ్య, జనార్ధన్ ,ఉప్పల రామ్మూర్తి ,దొడ్డి భీమయ్య, కోడి శ్రీనివాస్, మద్ది శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఆరాధ్య ఫౌండేషన్ ఆపన్న హస్తం

Submitted by Upender Bukka on Sun, 11/09/2022 - 18:11

నాగారం ప్రజా జ్యోతి 11 సెప్టెంబర్  ..ఆపదలో ఉన్న వ్యక్తులకు ఆపన్న హస్తం  అందిస్తున్నారు ఆరోగ్య పౌండేషన్. వివరాల్లోకి వెళ్తే ఆదివారం నాగారం మండలం విజయనగర్ మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి స్పృహ కోల్పోయి పడి ఉండగా, అటుగా వెళుతున్న ఆరోగ్య ఫౌండేషన్ సభ్యులు ఈదుల రమేష్ చంద్ర గమనించి సత్వరమే అంబులెన్సుకి ఫోన్ చేసి గాయపడిన వ్యక్తి ని ఆసుపత్రికి తరలించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఆరోగ్య ఫౌండేషన్ సభ్యులను  పలువురు అభినందిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక

Submitted by Upender Bukka on Sun, 11/09/2022 - 17:59

నాగారం సెప్టెంబర్ 11(ప్రజా జ్యోతి).  మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామంలో నాగారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోడుసు లింగయ్య ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా ఉపేందర్. ఉపాధ్యక్షులుగా చిప్పలపల్లి లింగయ్య. వర్కింగ్ ప్రెసిడెంట్ గా చాగంటి మల్లయ్య. ప్రధాన కార్యదర్శిగా వెంకన్న. కోశాధికారిగా మల్లెపాక సైదులు. సోషల్ మీడియా ఇన్చార్జిగా చాగంటి రాజు. గౌరవ అధ్యక్షులుగా రాములు ను ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.

వైభవంగా స్త్రీల ఆదివారం వేడుకలు

Submitted by mahesh yadhav on Sun, 11/09/2022 - 15:36

నాగారం సెప్టెంబర్ 11(ప్రజా జ్యోతి).  నాగారం మండల పరిధిలోని పనిగిరి గ్రూప్ చర్చ్ కౌన్సిల్లోని సి ఎస్ ఐ చర్చి లో ఆదివారం జ్యోతిని వెలిగించి భక్తిశ్రద్ధలతో వైభవంగా స్త్రీల ఆదివారం వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్థానిక చర్చి పాస్టర్ రత్నాకర్. మరియు సంఘo సభ్యురాలు ముదిగొండ కలమ్మ మాట్లాడుతూ. ఈ ఆదివారాన్ని సంవత్సరంలో ఒకసారి స్త్రీల ఆదివారంగా దక్షిణ ఇండియా సంఘం సభ్యులు వేడుకలుగా. పండుగలాగా. చర్చి సభ్యులు జరుపుకుంటారని వారు అన్నారు. సమాజంలో స్త్రీ భార్యగా. తల్లిగా. మహోన్నతమైన వ్యక్తిగా ప్రతి ఒక్కరూ భావించాలని వారు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాసిన నాగారం మండల వీఆర్ఏలు

Submitted by Upender Bukka on Sat, 10/09/2022 - 15:24

నాగారం ప్రజా జ్యోతిసెప్టెంబర్ 9( ప్రజా జ్యోతి).   2020సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏల పే స్కేలు, ప్రమోషన్లు 55 సంవత్సరాల పైబడిన వీఆర్ఏలకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన నేటి వరకు నెరవేర్చలేదని  ఆవేదన వ్యక్తం చేస్తూ   నాగారం మండల వీఆర్ఏలు రాష్ట్ర ముఖ్యమంత్రి కి లేఖ రాశారు. అసెంబ్లీలో ప్రకటించి రెండు సంవత్సరాలు పూర్తయిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరు తిన్నట్లుగా ప్రవర్తించడం దుర్మార్గమైన చర్యని అన్నారు. తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రాసిన లేఖను కేసీఆర్ చిత్రపటానికి అందించారు.

మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా వెంకన్న

Submitted by mahesh yadhav on Sat, 10/09/2022 - 14:49

నాగారం, సెప్టెంబర్ 09(ప్రజా జ్యోతి). మండల కేంద్రానికి చెందిన పాముకుంట్ల మల్లయ్య-అండమ్మల కుమారుడు పాముకుంట్ల వెంకన్న మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికయ్యారు.ఈయన ప్రస్తుతం తిర్మలగిరి మండల పరిధిలోని వెలిశాల కాంప్లెక్స్ పరిధిలో గల సిద్దిసముద్రం తండాలో ఎస్జీటీ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ఈ అవార్డు అందుకున్నట్లు తెలిపారు. అనంతరం వెంకన్న ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

భారత్ జోడో యాత్రకు మద్దతుగా కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర.

Submitted by mahesh yadhav on Sat, 10/09/2022 - 10:37

ప్రజా జ్యోతి నాగారం సెప్టెంబర్ 08 దేశ సమైక్యతను కాపాడడం కోసం జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్రకు మద్దతుగా గురువారం నాగారం మండల కేంద్రము నుండి పణిగిరి వరకు తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఒకే నినాదం ఒకే లక్ష్యంతో 150 రోజులు 3500 కి.మీ 12 రాష్ట్రాల మీదుగా చేస్తున్న యాత్ర కు ప్రజలు ఘన స్వాగతం పలికి యాత్రను విజయవంతం చేయాలని కోరారు.