భద్రాద్రి కొత్తగూడెం

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Submitted by Guguloth veeranna on Mon, 14/11/2022 - 17:11

పాల్వంచ, నవంబర్ 14, ప్రజాజ్యోతి : పాల్వంచ పట్టణ పరిధి కాంట్రాక్టర్స్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ప్రిన్సిపల్ ఇస్మాయిల్ బహుమతులు అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు సాధించాలని ఆకాంక్షించారు.

గీతాంజలి విద్యానికేతన్ లో బాలల దినోత్సవం వేడుకలు

Submitted by Srikanthgali on Sun, 13/11/2022 - 20:55

గీతాంజలి విద్యానికేతన్ లో బాలల దినోత్సవం వేడుకలు

కొత్తగూడెం క్రైమ్, నవంబర్ 14, ప్రజాజ్యోతి:

ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు పట్టణంలోని గల పాఠశాలలో అంగరం వైభవంగా జరిగాయి. పట్టణంలోని గీతాంజలి విద్యానికేతన్ స్కూల్లో పిల్లలు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతోటి అలరించారు. స్కూల్ కరస్పాండెంట్ పసుపునుటి రమేష్ మాట్లాడుతూ దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈరోజు బాలల దినోత్సవం గా ప్రతి ఏటా నిర్వహించుకుంటున్నామన్నారు.

క్యాన్సర్ బారిన పడి మరణించిన కుంభాల లక్ష్మి భౌతిక కాయానికి నివాళులర్పించిన కనుకుంట్ల కుమార్

Submitted by Srikanthgali on Thu, 10/11/2022 - 18:17
  • క్యాన్సర్ బారిన పడి మరణించిన కుంభాల లక్ష్మి భౌతిక కాయానికి నివాళులర్పించిన కనుకుంట్ల కుమార్
  • కొత్తగూడెం క్రైమ్, నవంబర్ 10, ప్రజాజ్యోతి:
  • బూడిదగడ్డ మాజీ కౌన్సిలర్ అయినటువంటి కనుకుంట్ల కుమార్ బూడిదగడ్డ వాస్తవ్యురాలు కుంభాల లక్ష్మి మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని కుంభాల లక్ష్మీ భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. తాను పనిచేసిన దగ్గర నుండి ప్రతి విషయంలో అన్నా అంటూ పలకరించిన చేల్లి ని కోల్పోవడం నిజంగా బాధగా అనిపిస్తుంది అన్నారు.

రైతుల నుండి ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలు సిద్ధం : డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల

Submitted by Guguloth veeranna on Thu, 10/11/2022 - 18:04

పాల్వంచ, నవంబర్ 10, ప్రజాజ్యోతి : రైతుల నుండి ధాన్యం సేకరణకు సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. గురువారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని గుడిపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాల్వంచ తహసిల్దార్ రంగా ప్రసాద్ తో కలిసి కొత్వాల ప్రారంభించారు.  ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ..

పెరిగిపోతున్న పేకాట రాయుళ్లు

Submitted by bathula ravikumar on Thu, 13/10/2022 - 11:18

పెరిగిపోతున్న పేకాట రాయుళ్లు

సుజాతనగర్ అక్టోబర్ 13 ప్రజాజ్యోతి:

సుజాతనగర్ మండలంలో పేకాట రాయుళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న సుజాతనగర్ మండలంలో పేకాట రాయుల హవా జోరుగా కొనసాగుతుంది ప్రతిరోజు రోజుకు ఒక గ్రామం చొప్పున వారు అడ్డాలు మారుస్తూ ఎవరికి దొరకకుండా జాగ్రత్త పడుతూ వారి ఆటలు మూడు ముక్కలు ఆరు పేకలు అన్నట్లు వారి ఆటలు దర్జాగా ఆడుతున్నారు.

శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అట్లతద్ది

Submitted by Srikanthgali on Wed, 12/10/2022 - 20:28

శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అట్లతద్ది

కొత్తగూడెం క్రైమ్, అక్టోబర్ 12, ప్రజాజ్యోతి: తెలంగాణకు బతుకమ్మ ఎంత పవిత్రమో, ఆంధ్ర ఆడపడుచులకు అట్లతద్ది అంత పవిత్రమైందని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ పేర్కొన్నారు . రామవరం శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో గోదం వాగు వద్ద జరిగిన అట్లతద్ది కార్యక్రమంలో పాల్గొన్న మునిగడప పద్మ మాట్లాడుతూ అట్లతద్ది నూతనంగా వివాహం చేసుకున్న మహిళలకు వాయనాలు తీర్చే అతి పవిత్రమైన పండుగని పేర్కొన్నారు. అట్లతద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పు ఓయ్, మూడట్లోయి అని ఒక మహాకవి పుస్తకాల్లో రాసిన, మేము చదువుకున్న విషయాలు గుర్తుకొస్తున్నాయని ఆమె అన్నారు.

చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

Submitted by bathula ravikumar on Tue, 11/10/2022 - 21:39

చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

సూజాతనగర్ అక్టోబర్ 11 ప్రజాజ్యోతి. చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీస్ లు మంగళవారం అరెస్ట్ చేశారు.

మా దారి మార్చండి మహాప్రభో

Submitted by Srikanthgali on Tue, 11/10/2022 - 15:27

మా దారి మార్చండి మహాప్రభో

కొత్తగూడెం క్రైమ్, అక్టోబర్ 11, ప్రజాజ్యోతి:

కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి లోని పాత కొత్తగూడెం ఏరియా లోని ప్రజలు రహదారి నిర్మాణం చేయాలనీ మున్సిపల్ అధికారులను వేడుకుంటున్నారు. గత నెలలో భారీ వాహనాల రాకపోకలు ఆగిపోవడం తో వాటివలన ఏర్పడిన గుంతలు భయాందోళనలకు గురించేస్తున్నాయి అని అక్కడి స్థానికులు అంటున్నారు. సాయంత్రం ఏడు దాటితే బైటికి రాలేక ఇబ్బంది పడుతున్నాం అని గడిచిన రెండు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు గుంతలు నీటితో నిండిపోయి ఉన్నాయని అవి ఎక్కడ వున్నాయి అర్ధం కాక వాహనాలు నడపడం లేదని అత్యవసర అయితే తప్ప బైటికి వెళ్లడం లేదని అంటున్నారు.

జోరుగా గుట్కా దందా

Submitted by bathula ravikumar on Tue, 11/10/2022 - 14:49

జోరుగా గుట్కా దందా

సుజాతనగర్ అక్టోబర్ 11 ప్రజాజ్యోతి. ప్రభుత్వం నిషేదించిన గుట్కా వ్యాపారం సుజాతనగర్ మండలం లో జోరుగా సాగుతుంది . అధికారులు మండలం లో గుట్కా మాపీయ అరికట్టడం లో విఫలం అయినారు అని ప్రజలో ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కనిపించే వ్యాపారం ఒకటి షాపులు అడ్డగా పేట్టుకోని వేనక జోరుగా గుట్కా దందా వ్యాపారం. సిరిపురం గ్రామ చివరిలో నివాసం ఉండే వ్యక్తి మండలం అంతాట గుట్కా సరపరా అతనిదే ఉదయం సాయంత్రం సమయాలలో మోటారు సైకిలు పై గుట్కా ప్యాకేట్లని మండల కేంద్రంలోని అనేక గ్రామాలకి తరలిస్తున్నారు అని చర్చ జోరుగా సాగుతుంది.