భద్రాద్రి కొత్తగూడెం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి కి శుభాకాంక్షలు తెలిపిన ఎస్.జె.కె అహ్మద్

Submitted by Guguloth veeranna on Sat, 26/11/2022 - 16:13

పాల్వంచ, నవంబర్ 26, ప్రజాజ్యోతి : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ ను నేతాజీ యువజన సంఘం, జనతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.జె.కె అహ్మద్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ ను నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు ఎస్.జె.కె అహ్మద్ శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సత్కరించారు.

నైటింగేల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన కొత్తగూడెంలో మనో విజ్ఞాన యాత్ర కార్యక్రమం

Submitted by Srikanthgali on Fri, 25/11/2022 - 14:10

నైటింగేల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన కొత్తగూడెంలో మనో విజ్ఞాన యాత్ర కార్యక్రమం

కొత్తగూడెంక్రైమ్, నవంబర్ 24, ప్రజాజ్యోతి:

మానసిక వికాసమే లక్ష్యంగా నైటింగేల్ ట్రస్ట్ ద్వారా మన కొత్తగూడెంలో మనోవిజ్ఞాన యాత్ర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. మానసిక,సాంకేతిక,ఆర్థిక సమస్యలను అధిగమించడానికి అదేవిధంగా యువశక్తిని పెంపొందించాలని గొప్ప సంకల్పంతో సూపర్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించబడి ఈ మిషన్ రెండు తెలుగు రాష్ట్రాలలో 30 జిల్లాలో 30 రోజుల పాటు జరుగుతున్న యాత్ర గురువారం కొత్తగూడెంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో విజయవంతంగా జరిగింది.

జనక్ ప్రసాద్ అధ్యక్షతన యూనియన్ లో చేరికలు

Submitted by Srikanthgali on Wed, 23/11/2022 - 17:33

సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అధ్యక్షతన యూనియన్ లో చేరికలు

కొత్తగూడెం క్రైమ్, నవంబర్ 23, ప్రజాజ్యోతి:

హెచ్ ఏం ఎస్ యూనియన్ నుండి ఐ న్ టి యూ సి యూనియన్లోకి చేరికలు జరుగుతున్నాయి అని కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ కేడెం ఆల్బర్ట్ అన్నారు. కొత్తగూడెం ఏరియా ఓసీ సి హెచ్ పి, లో విధులు నిర్వహిస్తున్న హెచ్ ఏం ఎస్ యూనియన్ పిట్ సెక్రటరీ రాచెర్ల శ్రీనివాస్ ఆ యూనియన్ కి రాజీనామా చేసి ఐ న్ టి యూ సి సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో యూనియన్ లో కి వచ్చారన్నారు.

బాలల హక్కులు సక్రమంగా అమలు చేయాలి

Submitted by Srikanthgali on Mon, 21/11/2022 - 17:36

బాలల హక్కులు సక్రమంగా అమలు చేయాలి

కొత్తగూడెం క్రైమ్, నవంబర్ 21, ప్రజాజ్యోతి:
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని గాజులరాజం బస్తీ24వ వార్డులో బాలల హక్కుల ప్రజాధ్వని రాష్ట్ర అధ్యక్షురాలు కెడెం కృష్ణావేణి ఆధ్వర్యంలో బాలల హక్కుల దినోత్సవవేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కృపావేణి మాట్లాడుతూ 1989 నవంబర్ 20వ తేదీన వివిధ దేశాల ప్రభుత్వాల కృషి ఫలితంగా బాలల హక్కుల తీర్మానం ఐక్యరాజ్యసమితి ఆమోదించిందని గుర్తు చేశారు. బాలల హక్కుల చట్టాలు ఉన్నప్పటికీ బాలలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

శివాలయంలో కార్తీక పూజలు

Submitted by bathula ravikumar on Mon, 21/11/2022 - 17:10

శివాలయంలో కార్తీక పూజలు

సుజాతనగర్ నవంబర్ 21 ప్రజాజ్యోతి 

మండల కేంద్రంలోని ఉత్తర వాహిని నది తీరమున వేంచేసి ఉన్న స్వయంభు శ్రీ సోమేశ్వర స్వామి శివాలయం నందు కార్తీక చివరి సోమవారం సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు చొప్పకట్ల జనార్ధన్ శర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజామునుండే ప్రత్యేక అభిషేకములు నిర్వహించారు భక్తులు దూర ప్రాంతాల నుండి వచ్చి వాగులో స్నానమాచరించి అరటి దోప్పలో కార్తీక దీపాలు వెలిగించారు ఆలయ ఆవరణలోని మర్రిచెట్టు ఉసిరి చెట్టు కింద ప్రమిదలు దీపాలు వెలిగించి తమ మొక్కులను చెల్లించుకున్నారు శివాలయంలో ఓం నమశ్శివాయ నామస్మరణలతో మార్మోగిపోయిం

ప్లాస్టిక్ విక్రయించిన వారిపై కొరడా ఝులిపించిన కమిషనర్

Submitted by Guguloth veeranna on Fri, 18/11/2022 - 22:02

పాల్వంచ, నవంబర్ 18, ప్రజాజ్యోతి : మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా నిషేధిత ప్లాస్టిక్ కమ్మినచో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మున్సిపల్ కమిషనర్ చింత శ్రీకాంత్ హెచ్చరించారు. పట్టణంలో ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణాలపై శుక్రవారం మున్సిపల్ సిబ్బంది రైడింగ్ నిర్వహించారు. ఈ రైడింగ్ లో స్థానిక రాజీవ్ గాంధీ మార్కెట్లోని రాందేవ్ ఎంటర్ ప్రైజెస్ లో 1000 కిలోల సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లు దొరికాయి. మున్సిపల్ కమిషనర్ రాందేవ్ ఎంటర్ప్రైజెస్ వారికి రూ.25వేలు జరిమానా విధించారు. అనంతరం ప్లాస్టిక్ ని సీజ్ చేశారు.

దేశంలోనే సహకార రంగం ఎంతో కీలకమైనది

Submitted by Guguloth veeranna on Fri, 18/11/2022 - 21:56

పాల్వంచ, నవంబర్ 18, ప్రజాజ్యోతి : భారతదేశంలోనే సహకార రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ఎంతో కీలకమైనదని డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. 69వ సహకార వారోత్సవాల సందర్భంగా శుక్రవారం పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురం రైతు వేదికలో రైతులతో సహకార వారోత్సవాల సభ నిర్వహించారు. ఈ సభలో కొత్వాలతో పాటు జిల్లా సహకార అధికారి ఎన్. వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సహకార వ్యవస్థ అవసరాన్ని గుర్తించిన కేంద్రం సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందన్నారు.

శ్రీ చైతన్య పాఠశాలలో మ్యాథ్స్ క్లబ్ ప్రారంభం

Submitted by Guguloth veeranna on Fri, 18/11/2022 - 21:48

పాల్వంచ, నవంబర్ 18, ప్రజాజ్యోతి : పట్టణ పరిధి కాంట్రాక్టర్స్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం మ్యాథ్స్ క్లబ్ ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బొల్లోరిగూడెం హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రాజమౌళి, అభ్యుదయ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఏ.హరి ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గణితం యొక్క ఆవశ్యకతను, మెలకువలను విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఇస్మాయిల్ మాట్లాడుతూ..

తెలంగాణ రక్షణ సమితి (టిఆర్ఎస్) పార్టీలో అజ్మీర రాజశేఖర్ సైన్యం అడుగులు

Submitted by Srikanthgali on Thu, 17/11/2022 - 23:02

తెలంగాణ రక్షణ సమితి (టిఆర్ఎస్) పార్టీలో అజ్మీర రాజశేఖర్ సైన్యం అడుగులు.

కొత్తగూడెం క్రైమ్, నవంబర్17, ప్రజాజ్యోతి:

తెలంగాణ రక్షణ సమితి పార్టీ స్థాపించిన అనతికాలంలో ఒక ప్రభంజనంలా తయారు అయిందని పార్టీ వ్యవస్థాపకుడు నరాల సత్యనారాయణ అన్నారు.గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డులో అజ్మీరశేఖర్ నాయకత్వంలో తెలంగాణ రక్షణ సమితి (టిఆర్ఎస్) లో అధిక సంఖ్యలో యువకులు పార్టీ యొక్క సిద్ధాంతాలు, కట్టుబాట్లు, వ్యూహాలు, పధకాలకు ఆకార్షితులై వాటి గురించి తెలుసుకొని పార్టీలోకి చేరడం జరిగింది అని తెలిపారు.