శ్రీ చైతన్య విద్యార్థులకు నాసా కిట్స్ అందజేత

Submitted by Guguloth veeranna on Thu, 10/11/2022 - 17:51
Shri Chaitanya distributed NASA kits to the students

శ్రీ చైతన్య విద్యార్థులకు నాసా కిట్స్ అందజేత 
పాల్వంచ, నవంబర్ 10, ప్రజాజ్యోతి : పాల్వంచ పట్టణ పరిధి కాంట్రాక్టర్స్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు నాసా స్పేస్ సెటిల్మెంట్స్ కాంటెస్ట్ లో పాల్గొంటున్న సందర్భంగా నాసా కిట్స్ అందజేశారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు విద్యార్థులను అభినందించి,  కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల అధినేత శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య కిట్స్ అందుకున్న విద్యార్థిని, విద్యార్థులు ప్రాజెక్టుని విజయవంతంగా పూర్తి చేయాలని ఆశించారు. అదే విధంగా డీజీఎం చేతన్, జయప్రకాష్, కో ఆర్డినేటర్ కృష్ణారావు, పాఠశాల ప్రిన్సిపాల్ ఇస్మాయిల్, అకాడమిక్ డీన్ నాగేశ్వరరావు, సి ఇంచార్జ్ నరేష్, నాసా ఇంచార్జ్ నరసింహారావు, పాఠశాల సిబ్బంది విద్యార్థినీ, విద్యార్థులను అభినందించారు.