Haliya

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు - ఎంఈఓ బాలు నాయక్

Submitted by kareem Md on Mon, 26/09/2022 - 12:58

హలియా,సెప్టెంబర్25 ప్రజా జ్యోతి: ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా దసరా సెలవులలో పాఠశాలలు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అనుముల మండల విద్యాధికారి బాలు నాయక్ తెలిపారు.సోమవారం 26 నుంచి అక్టోబర్ 09 వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు దినాలు ప్రకటించడమైనది. సెలవు దినాలలో ప్రైవేట్ తరగతులు నిర్వహించరాదన్నారు. నిబంధనల అతిక్రమించి తరగతులు నిర్వహించినట్లయితే చట్టపరంగా చర్యలు చేపడతామని తెలియజేశారు.  దసరా సెలవులలో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూన్నారని సమాచారం అందిందన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

Submitted by kareem Md on Sun, 25/09/2022 - 11:36


ఫోటో రైటప్: 1)బతుకమ్మను అలంకరిస్తున్న ఉపాధ్యాయుని విద్యార్థులు.
2) బతుకమ్మ ఆడుతున్న విద్యార్థులు.
3 మోదాల రవీందర్
4. నామిరెడ్డి మంజుల
5. అవని చతుర్వేది

క్రీడలతో మానసిక ప్రశాంతత

Submitted by kareem Md on Fri, 23/09/2022 - 11:45

-ఏకే పౌండేషన్ చైర్మన్ కట్టే బోయిన అనిల్ కుమార్ యాదవ్
ఫోటో రైటప్ : క్రీడా సామాగ్రిని అందజేస్తున్న అనిల్ కుమార్ యాదవ్.

గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలి

Submitted by kareem Md on Fri, 23/09/2022 - 10:52

హలియా,సెప్టెంబర్22(ప్రజా జ్యోతి):  మొదటి రెండవ విడుత పెండింగ్ లో ఉన్న గొర్రెల యూనిట్లను మంజూరు చేయాలని టి ఎస్ ఎస్ జి డి ఎస్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ కు వినతి పత్రం సమర్పించారు. గురువారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో గల గొర్రెలు,మేకల అభివృద్ధి కార్యాలయంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ యాదవ్ సంగం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న గొర్రెల యూనిట్లను వెంటనే మంజూరు చేయాలని కోరారు.

పోషకాహారమే తల్లి బిడ్డకు శ్రేష్టం - సిడిపిఓ గంధం పద్మావతి

Submitted by kareem Md on Thu, 22/09/2022 - 12:59

హలియా,సెప్టెంబర్21(ప్రజా జ్యోతి): తల్లి బిడ్డకు పోషకాహారం ఎంతో ఉపయోగపడుతుందని  సిడిపిఓ గంధం పద్మావతి అన్నారు.బుధవారం హాలియా మున్సిపాలిటీ పరిధిలో పోషణ మాస వారోత్సవాలను నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలకు తల్లులకు కిశోర బాలికలకు సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి పోషణ మొదలవ్వాలని తెలిపారు. బిడ్డ పుట్టగానే ముర్రు పాలు పట్టించాలని ఆరు నెలల వరకు తల్లిపాలు,టీకాలు వేయించాలని సూచించారు.  ఆరు నెలల నిండిన తర్వాత అనుబంధ పోషకాహారము మొదలుపెట్టాలని పేర్కొన్నారు. బిడ్డ క్రమంగా బరువు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ఉద్యమ ఆది గురువు బాపూజీ -మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి

Submitted by kareem Md on Wed, 21/09/2022 - 15:47

హలియా,సెప్టెంబర్2(ప్రజా జ్యోతి):  తెలంగాణ ఉద్యమానికి అది గురువు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్ర అమోఘమని మాజీ సిఎల్పీ నేత కుందూరు  జానారెడ్డి అన్నారు.బుధవారం హలియా మున్సిపాలిటీ ప్రధాన కూడలి నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాధన కొరకు తొలి దశ పోరాటంలో చురుకుగా వ్యవహరించడమే కాకుండా మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించిన త్యాగశీలి అని కొనియాడారు. బీసీల ఐక్యత కోసం నిర్విరామంగా శ్రమించిన వ్యక్తి, ఉన్నత విలువలతో పోరాటం చేసిన యోధుడని పొగిడారు.

శారీరక పరీక్ష లో ప్రతిభ కనబర్చాలి -ఎమ్మెల్యే నోముల భగత్

Submitted by kareem Md on Wed, 21/09/2022 - 13:08

హలియా,సెప్టెంబర్21(ప్రజా జ్యోతి):  ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యా శిక్షణను అభ్యసించాలంటే శారీరక పరీక్ష లో ప్రతిభ కనబరిచి విద్యను అభ్యసించాలని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. రాష్ట్రంలో ఆరు పరీక్షా కేంద్రాలలో నిర్వహించే శారీరక పరీక్ష  బుధవారం అనుముల పరిధిలో శ్రీకృష్ణ వ్యాయామ విద్యా కళాశాల లో నిర్వహించే   పరీక్ష కు హాజరై జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ విద్యార్థి టీచర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో మానసిక ఒత్తిడిని జయించేందుకు,శారీరక వికాసానికి క్రీడలు ఎంతో తోడ్పడతాయని తెలిపారు.

లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు -ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి

Submitted by kareem Md on Wed, 21/09/2022 - 12:03

ఫోటో రైటప్: సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి.
-పెన్షన్ పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి.

గెలుపే లక్ష్యంగా

Submitted by kareem Md on Tue, 20/09/2022 - 11:49

-జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గౌని రాజా రమేష్ యాదవ్
ఫోటో రైటప్:జాతీయ కార్యదర్శి తో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా రమేష్ యాదవ్

కబ్జా కోరల్లో ప్రభుత్వ భూమి

Submitted by kareem Md on Tue, 20/09/2022 - 11:08
  • ఫోటో రైటప్ : కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తున్న సామాజిక కార్యకర్త
  • -ఆక్రమణకు గురైన ప్రభుత్వ చెరువు భూమి (ఫైల్ ఫోటో)
  • - ఆర్డీవో ఆదేశాలు బేఖాతర్
  • -దర్జాగా సాగు చేసుకుంటున్న కబ్జా కోరులు 

 హాలియా,సెప్టెంబర్18(ప్రజా జ్యోతి):  హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటలో కబ్జాకు గురైన ప్రభుత్వ చెరువును కబ్జా కోరుల నుంచి కాపాడాలని సామాజిక కార్యకర్త లింగాల ప్రభాకర్ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ శర్మ కి వినతి పత్రం అందజేశారు.