నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు - ఎంఈఓ బాలు నాయక్

Submitted by kareem Md on Mon, 26/09/2022 - 12:58
Violation of rules will result in strict action - MEO Balu Naik

హలియా,సెప్టెంబర్25 ప్రజా జ్యోతి: ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా దసరా సెలవులలో పాఠశాలలు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అనుముల మండల విద్యాధికారి బాలు నాయక్ తెలిపారు.సోమవారం 26 నుంచి అక్టోబర్ 09 వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు దినాలు ప్రకటించడమైనది. సెలవు దినాలలో ప్రైవేట్ తరగతులు నిర్వహించరాదన్నారు. నిబంధనల అతిక్రమించి తరగతులు నిర్వహించినట్లయితే చట్టపరంగా చర్యలు చేపడతామని తెలియజేశారు.  దసరా సెలవులలో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూన్నారని సమాచారం అందిందన్నారు. సెలవు దినాలలో ప్రైవేట్ తరగతులు నిర్వహించకూడని ఇటీవల నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించనట్లైతే పాఠశాలలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.సెలవు దినాలలో ప్రైవేట్ తరగతులు నిర్వహిస్తే అట్టి పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని మండల విద్యాధికారి పత్రికా ప్రకటనలో తెలిపారు.