Haliya

అంగన్వాడి టీచర్ల సమీక్ష సమావేశం

Submitted by kareem Md on Thu, 29/09/2022 - 12:28

హలియా,సెప్టెంబర్28(ప్రజా జ్యోతి):  నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి అంగన్వాడీ టీచర్ల సమీక్ష సమావేశాన్ని అనుముల సెక్టార్ సిడిపిఓ గంధం పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు.

దళితుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం - ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి

Submitted by kareem Md on Thu, 29/09/2022 - 12:11

హలియా,సెప్టెంబర్28(ప్రజా జ్యోతి) :  దళితుల సంక్షేమమే  ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు.

బాపూజీ సేవలు దేశానికి స్ఫూర్తిదాయకం - ఎంపీపీ పేర్ల సుమతి పురుషోత్తం

Submitted by kareem Md on Wed, 28/09/2022 - 10:01

హలియా,సెప్టెంబర్27(ప్రజా జ్యోతి):  కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు భారతదేశానికి స్ఫూర్తిదాయకమని అనుముల ఎంపీపీ సుమతీ పురుషోత్తం అన్నారు.మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలలో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారుఅనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తమదైనపాత్ర పోషించినారన్నారు.స్వాతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు భారతదేశానికి స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గోళ్ళ లక్ష్మి,సీనియర్ అసిస్టెంట్ సమద్,రాములు టిఆర్ఎస్ పార్టీ,నాయకులు అంజద్ ఖాన్, ప్రభుత్వ అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

భావితరాలకు ఆదర్శం - ఎమ్మెల్యే నోముల భగత్

Submitted by kareem Md on Wed, 28/09/2022 - 08:53

హలియా,సెప్టెంబర్27(ప్రజా జ్యోతి):  బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ భావితరాలకు ఆదర్శమని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.మంగళవారం హాలియా మున్సిపాలిటీ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకలకు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ బాపూజీ ఉద్యమకారుడిగా, ప్రజాస్వామ్యవాదిగా,పీడిత ప్రజల పక్షపాతిగా,నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడని ఆయన కొనియాడారు.కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు.బాపూజీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.

అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శం - ఎమ్మెల్యే నోముల భగత్

Submitted by kareem Md on Tue, 27/09/2022 - 15:51

హలియా,సెప్టెంబర్26(ప్రజా జ్యోతి):  అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.పెద్దవూర మండల పరిధిలోని లింగంపల్లి, పెద్దగూడెం,శిరసనగండ్ల గ్రామాలలో సీసీ రోడ్ల పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశ ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా లేవన్నారు.అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందన్నారు.

భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలి

Submitted by kareem Md on Tue, 27/09/2022 - 15:14

 - జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌనీ రాజా రమేష్ యాదవ్ 

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరిక -ఎమ్మెల్యే నోముల భగత్

Submitted by kareem Md on Tue, 27/09/2022 - 13:18

హలియా,సెప్టెంబర్27(ప్రజా జ్యోతి):  సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిడమనూరు మండల పరిధిలోని ఊట్కూరు గ్రామానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆ పార్టీలకు రాజీనామా చేసి ఎమ్మెల్యే నోముల భగత్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరినారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్టం లో లేని విధంగా దళిత బంధు ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.

విద్య వైద్యం ఉపాధి కల్పించడమే లక్ష్యం

Submitted by kareem Md on Mon, 26/09/2022 - 13:27

విద్య వైద్యం ఉపాధి కల్పించడమే లక్ష్యం
- ఎంపీ, ఓ బి సి మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్
ఫోటో రైటప్: వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ లక్ష్మణ్

దసరా కానుకగా బతుకమ్మ చీరలు - ఎంపీపీ పేర్ల సుమతి

Submitted by kareem Md on Mon, 26/09/2022 - 13:07

హలియా,సెప్టెంబర్ 25(ప్రజా జ్యోతి):  తెలంగాణ ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు కానుకగా ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తుందని అనుముల మండల ఎంపీపీ సుమతి పురుషోత్తం అన్నారు. ఆదివారం అనుముల మండల పరిధిలోని పేరూరు,మదారి గూడెం గ్రామాలలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసినారు.అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు సుఖ సంతోషాలతో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు.