ఉద్యమ ఆది గురువు బాపూజీ -మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి

Submitted by kareem Md on Wed, 21/09/2022 - 15:47
Bapuji, the original guru of the movement - Former CLP leader Kunduru Janareddy

హలియా,సెప్టెంబర్2(ప్రజా జ్యోతి):  తెలంగాణ ఉద్యమానికి అది గురువు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్ర అమోఘమని మాజీ సిఎల్పీ నేత కుందూరు  జానారెడ్డి అన్నారు.బుధవారం హలియా మున్సిపాలిటీ ప్రధాన కూడలి నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాధన కొరకు తొలి దశ పోరాటంలో చురుకుగా వ్యవహరించడమే కాకుండా మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించిన త్యాగశీలి అని కొనియాడారు. బీసీల ఐక్యత కోసం నిర్విరామంగా శ్రమించిన వ్యక్తి, ఉన్నత విలువలతో పోరాటం చేసిన యోధుడని పొగిడారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం ఫలించాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప  మరో మార్గం లేదని ఆయన విశ్వసించారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాకునూరి నారాయణ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌని రాజా రమేష్ యాదవ్,గడ్డం రమణయ్య,మిట్టపల్లి వాసులు వెంపటి శ్రీను,నామిని సుధాకర్, కుకడాల చంద్రమౌళి,కొంగరి రవి,కుకడాల ఆంజనేయులు,  తదితరులు పాల్గొన్నారు.