పోషకాహారమే తల్లి బిడ్డకు శ్రేష్టం - సిడిపిఓ గంధం పద్మావతి

Submitted by kareem Md on Thu, 22/09/2022 - 12:59
Nutrition is best for mother and child - CDPO Sandalwood Padmavati

హలియా,సెప్టెంబర్21(ప్రజా జ్యోతి): తల్లి బిడ్డకు పోషకాహారం ఎంతో ఉపయోగపడుతుందని  సిడిపిఓ గంధం పద్మావతి అన్నారు.బుధవారం హాలియా మున్సిపాలిటీ పరిధిలో పోషణ మాస వారోత్సవాలను నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలకు తల్లులకు కిశోర బాలికలకు సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి పోషణ మొదలవ్వాలని తెలిపారు. బిడ్డ పుట్టగానే ముర్రు పాలు పట్టించాలని ఆరు నెలల వరకు తల్లిపాలు,టీకాలు వేయించాలని సూచించారు.  ఆరు నెలల నిండిన తర్వాత అనుబంధ పోషకాహారము మొదలుపెట్టాలని పేర్కొన్నారు. బిడ్డ క్రమంగా బరువు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజెర్స్ రమాదేవి,సైదా బేగం, గౌసియా బేగం,అంగన్వాడీ టీచర్స్,గర్భిణీలు,బాలింతలు తల్లులు తదితరులు పాల్గొన్నారు.