కబ్జా కోరల్లో ప్రభుత్వ భూమి

Submitted by kareem Md on Tue, 20/09/2022 - 11:08
 Govt land in possession
  • ఫోటో రైటప్ : కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తున్న సామాజిక కార్యకర్త
  • -ఆక్రమణకు గురైన ప్రభుత్వ చెరువు భూమి (ఫైల్ ఫోటో)
  • - ఆర్డీవో ఆదేశాలు బేఖాతర్
  • -దర్జాగా సాగు చేసుకుంటున్న కబ్జా కోరులు 

 హాలియా,సెప్టెంబర్18(ప్రజా జ్యోతి):  హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటలో కబ్జాకు గురైన ప్రభుత్వ చెరువును కబ్జా కోరుల నుంచి కాపాడాలని సామాజిక కార్యకర్త లింగాల ప్రభాకర్ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ శర్మ కి వినతి పత్రం అందజేశారు. సోమవారం గ్రీవెన్స్ డే లో భాగంగా లింగాల ప్రభాకర్ ఇబ్రహీంపేటలో కబ్జాకు గురైన ప్రభుత్వ చెరువును కాపాడాలని వినతి పత్రం ఇచ్చారు.గత రెండేళ్లుగా ఈ చెరువును కాపాడాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు అందజేస్తున్నా స్పందించడం లేదని ఆయన జాయింట్ కలెక్టర్ కి వివరించారు.ఇబ్రహీంపేట గ్రామంలో సర్వేనెంబర్ 16,17,68,72 లలో ఉన్న 33ఎకరాల ప్రభుత్వ భూమిని ఒకటో వార్డు కౌన్సిలర్ నల్లబోతు వెంకటయ్య,కీసరి యుగంధర్ రెడ్డిలు కబ్జా చేసి సాగు చేసుకుంటున్నారని తెలిపారు.ఈ విషయమై మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ అనుముల తాసిల్దార్ లావూరి మంగ కు పలుమార్లు వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు.వీటికి స్పందించిన మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ డివిజనల్ సర్వేయర్ బాలాజీ నాయక్ కు ఆక్రమించిన చెరువు భూమిని సర్వే చేసి నిబంధనల ప్రకారం హద్దురాళ్ళు పెట్టమని ఆదేశించినట్లు తెలిపారు. దీనిపై సర్వేయర్ బాలాజీ నాయక్ భూమిని సర్వే చేసేందుకు వచ్చి రెండుసార్లు ఆ ప్రాంత రైతులకు నోటీసులు ఇచ్చి సర్వే చేయకుండానే వెను తిరిగి పోయినట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి సాగు చేసుకుంటున్న వారిపై విచారణ చేసి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి కాపాడి ఆక్రమణదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన జాయింట్ కలెక్టర్ రాహుల్ శర్మకు వినతి పత్రం ఇచ్చారు.