లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు -ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి

Submitted by kareem Md on Wed, 21/09/2022 - 12:03
 Direct welfare benefits to beneficiaries - MLA Nomula Bhagat, MLC MC Kotireddy

ఫోటో రైటప్: సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి.
-పెన్షన్ పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి.
హలియా,సెప్టెంబర్20(ప్రజా జ్యోతి): 
దళారులు లేకుండా లబ్ధిదారులందరికీ నేరుగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే నోముల భగత్ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి లు అన్నారు. మంగళవారం హాలియా లక్ష్మీనరసింహ గార్డెన్స్ లో నూతనంగా మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు వారు అందజేశారు.అనంతరం లబ్ధిదారులను ఉద్దేశించి వయోపరిమితి తగ్గించడంతో రాష్ట్రంలో 10 లక్షల కొత్త పెన్షన్ లు మంజూరయ్యాయని తెలిపారు.దేశానికే ఆదర్శవంతంగా రైతు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. 57 ఏళ్ళకు వయోపరిమితి తగ్గించి కొత్తగా 10 లక్షల ఫించన్ లు ప్రభుత్వం మంజూరుచేసిందనివారుతెలిపారు.ఒంట‌రిమ‌హిళ‌లు,బీడీకార్మికులు,చేనేత,గీతకార్మికులకుపెన్ష‌న్లుప్రభుత్వంఇస్తుందన్నారు.పంట‌లపెట్టుబ‌డులు,పంటరుణాలు, రుణ విముక్తి,రైతు బీమా, క‌ళ్యాణ ల‌క్ష్మీ,షాదీ ముబార‌క్‌, వంటి అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అమలు చేస్తోందని తెలిపారు.

కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు,పిడి రాజ్ కుమార్,ఎంపీపీ సుమతి పురుషోత్తం,మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య మలిగిరెడ్డి లింగారెడ్డి,వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, ఎమ్మార్వో మంగ,మున్సిపల్ కమిషనర్ వీరా రెడ్డి,కౌన్సిలర్లు వర్రా వెంకట్ రెడ్డి,ప్రసాద్ నాయక్,నల్లబోతు వెంకటయ్య అన్నేపాక శ్రీను,మండలపార్టీ అధ్యక్షులు కురాకుల వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షులు చెరుపల్లి ముత్యాలు,జిల్లా ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షుడు రావుల రాంబాబు చాపల సైదులు,రావుల లింగయ్య,సమీన అన్వరుద్ధిన్, ఎనమల్ల సత్యం,ధోరెపల్లి వెంకన్న,సురభి రాంబాబు, పొషం శ్రీనివాస్ గౌడ్,పంగ లక్ష్మణ్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.