Nampally

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నాంపల్లి సర్పంచ్ కుంభం విజయకృష్ణారెడ్డి

Submitted by Sathish Kammampati on Wed, 28/09/2022 - 08:45

నాంపల్లి, సెప్టెంబర్27 (ప్రజాజ్యోతి):   మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆవరణలో  స్థానిక సర్పంచి కుంభం  విజయ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో  ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ  కార్యక్రమం చేపట్టారు. అధిక సంఖ్యలో ఆడపడుచులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న చీరలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, స్థానిక ఉపసర్పంచి ఎస్కే అస్రాభి బేగం చాంద్ పాషా,  గ్రామపంచాయతీ సెక్రటరీ ఎండి సత్తార్, వార్డ్ మెంబర్లు పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గాదేపాక వేలాద్రి, పంగ కొండయ్య, మహాత్మ, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నాంపల్లిలో టిఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం వనభోజన కార్యక్రమం

Submitted by Sathish Kammampati on Tue, 27/09/2022 - 15:10

నాంపల్లి సెప్టెంబర్ 26 (ప్రజాజ్యోతి ):  ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందనిప్రపంచ దేశాలలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత  తెలంగాణ  సీఎం కేసీఆర్ దేనని  విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళన, వనభోజన  కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కోలాటం,బోనాలు , బతుకమ్మలు , సాంస్కృతిక విన్యాసాలతో రెండు కిలోమీటర్లు ర్యాలీ తీశారు. మండలంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా  మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

వనభోజనాల జన సమీకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Submitted by Sathish Kammampati on Sun, 25/09/2022 - 13:15

టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి పల్లా దేవేందర్ రెడ్డి

Submitted by Sathish Kammampati on Fri, 23/09/2022 - 10:43

నాంపల్లి, సెప్టెంబర్ 22(ప్రజాజ్యోతి)..//..బాల కార్మిక వ్యవస్థను రూపు మాపటం కొసం అందరూ కృషి చేయాలనీ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కోరారు. గురువారం నాంపల్లి మండలం వడ్డేపల్లి  గ్రామంలో ఐ ఎల్ ఓ, ఏఐటీయూసీ,ఆధ్వర్యంలో జరిగిన పత్తి కార్మికుల గ్రామ స్థాయి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో ప్రధాన  వాణిజ్య పంటగా పత్తి ఉత్పత్తి ఉందని అన్నారు. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశంలో 25 శాతం ఉత్పత్తి అవుతుందని అన్నారు.

ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

Submitted by Sathish Kammampati on Fri, 23/09/2022 - 10:40

నాంపల్లి, సెప్టెంబర్ 22(ప్రజాజ్యోతి)..//.. నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో బుధవారం రోజున ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ బుషిపాక శాంతి కుమార్ మాదిగ హాజరైనారు. అనంతరం వారి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మార్పీస్ గ్రామ అధ్యక్షులుగా పల్లేటి సైదులు ప్రధాన కార్యదర్శిగా పల్లేటి ఆంజనేయులు, సహాయ కార్యదర్శిగా పుల్లేటి కాశయ్య సహాయ కార్యదర్శిగా పల్లేటి మహేష్ కోశాధికారిగా పల్లెటి ప్రవీణ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

గిరిజన రిజర్వేషన్ పెంపు చారిత్రాత్మకం రామచందర్ నాయక్

Submitted by Sathish Kammampati on Thu, 22/09/2022 - 14:37

నాంపల్లి, సెప్టెంబర్ 22(ప్రజా జ్యోతి).../../ గిరిజన రిజర్వేషన్ పెంపు చారిత్రాత్మకమని, ఈ నిర్ణయంతో సీఎం కేసీఆర్ గిరిజనులకు ఇందిరా, ఆరాధ్య దైవమని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామ్ చందర్  నాయక్ అన్నారు. బుధవారం స్థానిక టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోను కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలన్నారు. రిజర్వేషన్ల పెంపు బిల్లు ఏడేలుగా కేంద్రం తొక్కి పెట్టడం దారుణమని అన్నారు.గిరిజన బంధుతో, గిరిజన బిడ్డల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరి స్తాయని అన్నారు.