గిరిజన భవనం సందర్శనకు భారీగా తరలివెళ్లిన నాంపల్లి మండల గిరిజనులు

Submitted by Sathish Kammampati on Sat, 24/09/2022 - 12:52
Tribals of Nampally mandal who flocked to visit the tribal building


నాంపల్లి, సెప్టెంబర్ 23(ప్రజా జ్యోతి ):  హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్  నిర్మించిన గిరిజన భవనం సందర్శనకు నల్గొండ జిల్లా నాంపల్లి మండలానికి చెందిన గిరిజనులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలో దేవరకొండ శాసన సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్  జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూగిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు.గిరిజన రిజర్వేషన్ల పెంపు నిర్ణయం ఓ..చారిత్రాత్మక నిర్ణయం అని ఆయన తెలిపారు.2017 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచాలని అసంబ్లీలో తీర్మానం చేసి పంపించిన కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదన్నారు..ఇప్పటికైనా మా గిరిజనుల 10 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ నడి బొడ్డులో సేవాలాల్ బంజారా భవన్  నిర్మాణం చేసి ప్రాంభించుకోవడం శుభ పరిణామామన్నారు.గిరిజన రిజర్వేషన్  పది శాతం పెంపు, త్వరలోనే గిరిజన బంధు,పోడు భూముల సమస్య పరిష్కారం చేయడం జరుగుతుంది అని ఆయన తెలిపారు.దళితబందు తరహాలో గిరిజన బంధు అమలు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో గిరిజనుల జీవితాల్లో సరికొత్త అభివృద్ధి వెలుగులు నింపడం జరుగుతుందని  ఆయన తెలిపారు.వచ్చే ఎన్నికల్లో మా గిరిజనులు  సీఎం కి పట్టం కట్టడం ఖాయం అని ఆయన తెలిపారు.ప్రతి ఒక్క గిరిజనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కి రుణపడి  ఉంటారని ఆయన తెలిపారు.గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చిన.. మరిన్ని వరాలు ప్రసాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాదాభివందనమని గిరిజనుల పట్ల కేసీఆర్ మరో సేవాలాల్ మహరాజ్  అని ఆయన కొనియాడారు.

కేంద్ర ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ బిల్లుకు వెంటనే ఆమోదం తెలుపాలి అని ఆయన అన్నారు.గిరిజన తండాలను గ్రామ పంచాయతీలను చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఆయన గుర్తు చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిచ్చి వాటికి రైతు బంధు వర్తించేలా చేస్తానని ప్రకటించడం గొప్ప విషయమన్నారు. ఉక్కు కర్మాగారం, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు పై కేంద్రంపై ఒత్తిడి తెస్తామనడం గిరిజనులపై సీఎం కేసీఆర్ కు ఉన్న దార్శనికతకు నిదర్శనమన్నారు.సద్గురు శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల ప్రజాప్రతినిధులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.