గిరిజన రిజర్వేషన్ పెంపు చారిత్రాత్మకం రామచందర్ నాయక్

Submitted by Sathish Kammampati on Thu, 22/09/2022 - 14:37
The increase in tribal reservation is historic    Ramachander Naik

నాంపల్లి, సెప్టెంబర్ 22(ప్రజా జ్యోతి).../../ గిరిజన రిజర్వేషన్ పెంపు చారిత్రాత్మకమని, ఈ నిర్ణయంతో సీఎం కేసీఆర్ గిరిజనులకు ఇందిరా, ఆరాధ్య దైవమని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామ్ చందర్  నాయక్ అన్నారు. బుధవారం స్థానిక టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోను కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలన్నారు. రిజర్వేషన్ల పెంపు బిల్లు ఏడేలుగా కేంద్రం తొక్కి పెట్టడం దారుణమని అన్నారు.గిరిజన బంధుతో, గిరిజన బిడ్డల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరి స్తాయని అన్నారు. బంజారాలకు   1000 గజాల స్థలం కోసం అన్ని ప్రభుత్వాల చుట్టూ ఏళ్ల తరబడి చెప్పులు అరిగెల తిరిగామని, కేసీఆర్ రెండెకరాల భూమి ఇప్పించి రూ. 46 కోట్లతో గిరిజన, ఆదివాసి భవనాలు నిర్మింపజేసి తమ ఆత్మ గౌరవం నిలబెట్టాడని మునుముందు బంజారా జాతి యావత్తు కేసీఆర్ వెన్నంటే ఉంటుందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుమ్మడపు నరసింహా  రావు, ముష్టిపల్లి ఎంపీటీసీ రమావతి బుజ్జి చందులాల్, సర్పంచులు రమావతి సుగుణ శంకర్ నాయక్, రాపోతు దేవేంద్ర సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షులు మెగావత్ బాలాజీ, రామావత్ హతీరా,జగన్, శ్రీనివాస్, మేఘావత్ బాషా, హనుమంతు మార్కెట్ డైరెక్టర్  లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు