Nampally

సభలు రాస్తారోకోలు ధర్నాలకు తప్పనిసరి అనుమతి

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 09:48
  • - సర్కిల్ -ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విఠల్ రెడ్డి
  • నాంపల్లి సెప్టెంబర్ 30(సామాజిక తెలంగాణ:

నాంపల్లి, సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి ): నాంపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ముందస్తు పోలీసు వారి అనుమతి (పర్మిషన్ )లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, రాస్తారోకోలు మరియు ధర్నాలు నిర్వహించరాదని,ఒకవేళ అనుమతి లేకుండా నిర్వహిస్తే  తగు చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని బి. విఠల్ రెడ్డి  సర్కిల్ ఇన్స్పెక్టర్  పోలీస్ నాంపల్లి సర్కిల్ ఒక ప్రకటన తెలిపారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 11:33

నాంపల్లి, సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి ): మండలం  జాన్ తండా గ్రామం దోరోనిగడ్డ తండలోని టీ.ఆర్.ఎస్ పార్టీ కుటుంబానికి చెందిన మెగావత్ వస్య బుధవారం మరణించడం జరిగింది. ఇట్టి విషయం తెలుసుకున్న నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ తన వంతు సాయంగా మృతుని కుటుంబానికి 10.000/- వేల రూపాయలు   మండల ఎస్టీ సెల్  అధ్యక్షులు సపావత్ సర్దార్ నాయక్ ద్వారా మృతుని కుటుంబానికి అందజేయడం జరిగింది.

తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ ఎంపిపి శ్వేత రవిందర్ రెడ్డి

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 11:27

నాంపల్లి, సెప్టెంబర్ 29 (ప్రజాజ్యోతి):  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నాంపల్లి మండల ఎంపిపి ఏడుదోడ్ల శ్వేత రవిందర్ రెడ్డి మల్లపురాజ్ పల్లి  గ్రామంలో ముఖ్య అతిథిగా పాల్గొని చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మునగాల సుధాకర్ రెడ్డి ,ఎంపిడివో రాజు,ఉప సర్పంచ్ గోగు శ్రీను , పంచాయతీ కార్యదర్శి మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

ప్రతి ఇంటింటికీ గోడ గడియారాలు పంపిణి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 13:16

కేతేపల్లి సర్పంచి కోరే ప్రమీల యాదయ్య గడియారాలు పంపిణీ
నాంపల్లి, సెప్టెంబర్ 28 (ప్రజాజ్యోతి ):  
మండలం కేతేపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ  ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ కోరె ప్రమీల యాదయ్య  ప్రతి ఇంటి ఇంటికి గోడ గడియారాలు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని  తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పల్స సైదులు,వార్డు మెంబర్లు శంకర్, రవి,ఆంజనేయులు అదేవిధంగా సీనియర్ నాయకులు ఎడ్ల అంజయ్య, కృష్ణయ్య, దండిగ లింగయ్య, చేపూరు శ్రీను కార్యకర్తలు ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.

సిసి రోడ్ పనులు ప్రారంభించిన స్థానిక సర్పంచ్ దామెర యాదగిరి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 13:14

నాంపల్లి,సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి ):  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ. తొమ్మిది లక్షలతో సిసి రోడ్ పనులు ప్రారంభించడం జరిగింది. నాంపల్లి మండలం దామెర గ్రామంలో స్థానిక సర్పంచ్ దామెర యాదగిరి బుధవారం నాడు సిసి రోడ్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి వీధి పరిశుభ్రంగా ఉండాలని గ్రామ అభివృద్ధి కొరకు ఒక సైనికుడిలా పనిచేస్తానని అన్నారు.ఇట్టి పనులు నాణ్యతతో కలిగి ఉండాలని వారు దగ్గరుండి రోడ్లు వేయిస్తున్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దామర ఉత్తరయ్య, ఏలందర్, కడారి పెద్దలు  గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట మహిళలకు పెద్దన్నగా కెసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణి చేస్తున్న జడ్పిటిసి ఏవి రెడ్డి

Submitted by mallesh on Thu, 29/09/2022 - 12:55

నాంపల్లి, సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి ):  ఆడబిడ్డలకు పెద్దన్నగా అండగా  కెసీఆర్  దసరా పండుగ పూట కొత్త బట్టలతో  సంతోషంగా ఉండాలని బతుకమ్మ చీరలను అందజేస్తున్నట్లు జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి అన్నారు. బుధవారం నాడు నాంపల్లి మండలం తిరుమలగిరి, పసునూరు గ్రామాలలో ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు.

ధళితుల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది తుంగపహాడ్ సర్పంచ్ దండిగా అలివేలు నరసింహ

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:53

నాంపల్లి, సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి ):   దళితుల అభివృద్ధికి  ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని స్థానిక గ్రామ సర్పంచ్ దండిగ అలివేలు నర్సింహా అన్నారు‌.మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి మండలం తుంగపాడ్ గ్రామంలో ధళిత వాడల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం  జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...