న్యూ మాంగ్స్ కింగు ఫు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు

Submitted by Sathish Kammampati on Sun, 25/09/2022 - 12:18
New Mangs Qingu Fu are students of Gandhiji educational institutes selected for national level competitions

ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

నాంపల్లి, సెప్టెంబర్ (ప్రజాజ్యోతి ): మాస్టర్ కేషమ్ గౌడ్ ఆధ్వర్యంలో నవంబర్ 13న జరిగే ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ సెకండ్ ఇంటర్ ఒకేషనల్ ఛాంపియన్ షిప్ హైదరాబాదులోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో  నిర్వహించబడును.ఇట్టి క్రీడలకు  ప్రపంచం నలుమూలలు ఉగాండా, శ్రీలంక, బాంగ్లాదేశ్, నేపాల్, ఇండోనేషియా,ప్రాన్స్ దేశాల నుండి 2000 మంది  క్రీడాకారులు పాల్గొంటారని, అదేవిధంగా ఈ ఛాంపియన్షిప్ కు నాంపల్లి, చండూర్ మండల గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు కోచ్ డాక్టర్ షంశీర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి క్రీడలకు  ఎంపికైయరని న్యూ మాంగ్స్ కుంగు ఫు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట వైస్ ప్రెసిడెంట్,  ట్రస్మా జిల్లా అధ్యక్షులు,గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ :కోడి శ్రీనివాసులు ఒక ప్రకటనలో  తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాతో పాటు విద్యార్థులకు ముఖ్యంగా మహిళల మీద ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని  పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు న్యూ మాక్స్ కుంగు ఫు లాంటి కరాటే అభ్యసించడం వలన  మానసికంగా, శారీరకంగా, దృఢంగా ఉంటూ రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు. అదేవిధంగా తమను తాము రక్షించుకోవడమే కాకుండా ఎదుటివారిని కూడా రక్షించడానికి వెనుకాడరని అన్నారు.

ఈ ఛాంపియన్ షిప్ పోటీలకు  న్యూ మాక్స్ కుంగు ఫు  జాతీయ వైస్ ప్రెసిడెంట్ సుమన్, సంస్థ ఫౌండర్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్ రాజ్ నాధ్  పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యకమంలో గాంధీజీ విద్యా సంస్థల  డైరెక్టర్స్ సరికొండ వెంకన్న, కర్నాటి నాగరాజు, ప్రిన్సిపల్ బంధనాథం సురేష్ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.