బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి పల్లా దేవేందర్ రెడ్డి

Submitted by Sathish Kammampati on Fri, 23/09/2022 - 10:43
Child labor should be eradicated   Palla Devender Reddy

నాంపల్లి, సెప్టెంబర్ 22(ప్రజాజ్యోతి)..//..బాల కార్మిక వ్యవస్థను రూపు మాపటం కొసం అందరూ కృషి చేయాలనీ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కోరారు. గురువారం నాంపల్లి మండలం వడ్డేపల్లి  గ్రామంలో ఐ ఎల్ ఓ, ఏఐటీయూసీ,ఆధ్వర్యంలో జరిగిన పత్తి కార్మికుల గ్రామ స్థాయి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో ప్రధాన  వాణిజ్య పంటగా పత్తి ఉత్పత్తి ఉందని అన్నారు. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశంలో 25 శాతం ఉత్పత్తి అవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రత్తి ఉత్పత్తిలో దాదాపు 6 కోట్ల మంది రైతులు 10 కోట్ల మంది గ్రామీణ కార్మికులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రత్తి పంట ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఉత్పత్తిలో భాగస్వామ్యమైన సన్న మధ్య రైతులకు, వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత, కార్మిక చట్టాలు అమలు కోసం ఐఎల్ఓ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) కృషి చేస్తుందని అన్నారు. కార్మిక హక్కుల ప్రయోజనాల కోసం ఏఐటియుసి నిరంతరం అండగా నిలిచి పోరాడుతుందని అన్నారు. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు ,శ్రమకు తగ్గ వేతనాలు పెంచాలనీ కోరే హక్కు ఉంటుందని అన్నారు.కార్మికుల ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొస్తున్నాయని వాటి అమలకు సమిష్టిగా పని చేయాలని అన్నారు. బాల కార్మిక వ్యవస్థ రూపుమాపాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య  జిల్లా కన్వీనర్ గిరి రమా,సర్పంచ్ బుషిపాక లీలప్రియ  నాగేష్, ఊరిపక్క వెంకటయ్య సిపిఐ మండల సహాయ కార్యదర్శి, బుషిపాక సుగుణయ్య భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి మండల ప్రధాన కార్యదర్శి, బుషిపాక శాంతి కుమార్,ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ ,కాటిక రమేష్,విద్యా కమిటీ చైర్మెన్ గిరి స్వామి మండల కార్యవర్గ సభ్యులు, కానుగుల మహేష్ ,బుషిపాక ప్రశాంత్, నారపాక రవి, బుసిపాక నరసింహ, బుషిపాక గిరి, కాటిక రాణమ్మ బుషిపాక అండాలు బుసిపాక భాగ్యమ్మ, బుషిపాక రాణమ్మ బుసిపాక కవిత తదితరులు పాల్గొన్నారు.