Chityala

మృతుడి కుటుంబానికి పరామర్శ

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 16:56

చిట్యాల ప్రజా జ్యోతి సెప్టెంబర్ 22,   మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు అల్లం రవీందర్, మాజీ ఉపసర్పంచ్ అల్లం తిరుపతి ల తండ్రి అల్లం వెంకట్ నర్సు ఇటీవల మృతి చెందగా గురువారం శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట జడ్పిటిసి గొర్రె సాగర్,మండల అధ్యక్షులు ఆరేపల్లి మల్లయ్య,నాయకులు పిట్ట సురేష్, కొక్కుల సదానందం, గుండ రవీందర్, చిలుముల రమణాచారి, కటుకూరి నరేందర్ లో ఉన్నారు.

కస్తూర్బా హాస్టల్ లో పోషణ మాసం

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:05

 చిట్యాల ప్రజా జ్యోతిసెప్టెంబర్ 21, ..../ మండలంలోని కస్తూరిబా హాస్టల్ లో పిల్లలకు పోషణ మాసం  సమావేశం ఏర్పాటు చేసి పిల్లలు తీసుకోవలసిన ఆహారము వ్యక్తిగత శుభ్రత విద్య  ప్రాముఖ్యత బాల్య వివాహము జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై జయప్రద సూపర్వైజర్ వివరించారు ముఖ్యంగా ఎదిగే బాలికలు కాబట్టే కాబోయే తల్లులు అన్ని రకాల ఆహార పదార్థాలు పండ్లు,పాలు, ఆకుకూరలు,కూరగాయలు, మొలకెత్తించిన గింజలు, పల్లి బెల్లం, సమపాళ్లలో భుజించి రక్తహీనత రాకుండా పోషకాహార లోపానికి గురికాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు అని అన్నారు.

జిల్లా కన్వీనర్ గా శ్రీనివాస్.

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 16:30

చిట్యాల ప్రజా జ్యోతి సెప్టెంబర్ 21,../ భారతీయ జనతా పార్టీ ఎక్స్ సర్వీస్ మెన్ జిల్లా కన్వీనర్ గా చిట్యాల మండల లోని గుంటుపల్లి గ్రామానికి చెందిన మొలకల పల్లి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు  బిజెపి జిల్లా అధ్యక్షుడు కన్నం యుగందర్ తెలిపాడు.శ్రీనివాస్  గతంలో చిట్యాల మండల బిజెపి  మండల ఉపాఅధ్యక్షుడిగా ఎన్నో సేవలు చేశారని పార్టీ ఎదుగుదల్లో కిల కంగా వ్యవహరించారని  ప్రజా సమస్యల పరిష్కరించడంలో ముందుండేవారని ఆయన సేవలను గుర్తించి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.

పేదల ఆపద్భాందవుడు కేసీఆర్ గొప్పోడా..? పేదల నడ్డి విరిచే మోడీ గొప్పొడా..?

Submitted by Sathish Kammampati on Wed, 21/09/2022 - 13:10
  • దేశ ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయ్
  • ఓటు అడిగే హక్కు టిఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే ఉంది
  • నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
  • వెలిమినేడు, పిట్టంపల్లి గ్రామాల్లో ఆసరా పెన్షన్ల లబ్దిదారులకు కార్డుల పంపిణీ

చిట్యాల సెప్టెంబర్ 21(ప్రజాజ్యోతి)నల్లగొండ జిల్లా: పేద ప్రజల సంక్షేమం కోసం అండగా నిలిచే ఆపద్భాందవుడు కేసీఆర్ గొప్పోడా..?

సత్యనారాయణ పార్ధివ దేహానికి నివాళి

Submitted by Sathish Kammampati on Tue, 20/09/2022 - 16:32

చిట్యాల సెప్టెంబర్ 20(ప్రజాజ్యోతి)../  నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పదో వార్డు కు చెందిన కొత్త కొండ సత్యనారాయణ అనారోగ్యంతో మంగళవారం మరణించారు. సత్యనారాయణ పార్ధీవదేహానికి నివాళులు అర్పించి,ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,అలాగే చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకట్ రెడ్డి,చిట్యాల టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఉప్పల్ రెడ్డి,పొన్నం లక్ష్మయ్య గౌడ్,గుండెబోయిన సైదులు.శీల సత్యనారాయణ, బిజెపి రాష్ట్ర కిషన్ మోర్చా నాయకులు చికాలామెట్ల అశోక్, కాలనీవాసులు,నాయకులు ,తదితరులు కూడా నివాళులు అర్పించారు.

కల్లుగీత వృత్తి దారులకు ఐదు వేల పెన్షన్ ఇవ్వాలి

Submitted by Sathish Kammampati on Tue, 20/09/2022 - 16:29

చిట్యాల సెప్టెంబర్ 20(ప్రజాజ్యోతి).. కల్లు గీత వృత్తి చేసే వారందరికీ వయస్సుతో నిమిత్తం లేకుండా పెన్షన్ ఐదు వేలు ఇవ్వాలని ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పామనుగుల్ల అచ్చాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో మంగళవారం నాడు సంఘం సమావేశం జరిపి మహా సభల కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా అచ్చాలు మాట్లాడుతూ ఈ నెల 26 వ తేదీ న చండూరు లో జరుగుతున్న కల్లు గీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా ద్వితీయ మహాసభలు జయప్రధం చేయాలని కోరారు.

ఆహార నియమాలు పాటించాలి

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:51

 చిట్యాల ప్రజా జ్యోతి సెప్టెంబర్ 19,../ మండలంలోని ముచ్చటపర్తి గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచి నందికొండ కవిత ఆధ్వర్యంలో అంగన్వాడి సూపర్వైజర్ జయప్రద మాట్లాడుతూ మహిళలలో కిషోర్ బాలికలలో పిల్లలలో పోషకాహార లోపాన్ని రక్తహీనతను తగ్గించుటకు తీసుకోవలసిన ఆహారం ఆరోగ్యం వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత త్రాగే మంచి నీరు ప్రాముఖ్యతల గూర్చి వివరించారు.

దేశం గర్వించే రీతిలో అభివృద్ధి

Submitted by Sathish Kammampati on Tue, 20/09/2022 - 11:51
  • పల్లెలు పట్టణాలకు శోభ తెచ్చిన ఘనత కెసిఆర్ దే  
  • నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 
  • రామన్నపేట మండలంలోరూ. 2 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చిట్యాల సెప్టెంబర్ 19(ప్రజాజ్యోతి)నల్లగొండ జిల్లా:తెలంగాణను దేశం గర్వించే రీతిలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కెసిఆర్ కి దక్కుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు.