పేదల ఆపద్భాందవుడు కేసీఆర్ గొప్పోడా..? పేదల నడ్డి విరిచే మోడీ గొప్పొడా..?

Submitted by Sathish Kammampati on Wed, 21/09/2022 - 13:10
Is KCR the protector of the poor? Is Modi great for breaking the poverty of the poor?
  • దేశ ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయ్
  • ఓటు అడిగే హక్కు టిఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే ఉంది
  • నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
  • వెలిమినేడు, పిట్టంపల్లి గ్రామాల్లో ఆసరా పెన్షన్ల లబ్దిదారులకు కార్డుల పంపిణీ

చిట్యాల సెప్టెంబర్ 21(ప్రజాజ్యోతి)నల్లగొండ జిల్లా: పేద ప్రజల సంక్షేమం కోసం అండగా నిలిచే ఆపద్భాందవుడు కేసీఆర్ గొప్పోడా..? రైతు వ్యతిరేక చట్టాలతో పేదల నడ్డి విరిచే మోడీ గొప్పొడా అని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ప్రశ్నించాడు. మంగళవారం నాడు చిట్యాల మండలంలోని వెలిమినేడు, పిట్టంపల్లి గ్రామాల్లో ఆసరా పెన్షన్ల లబ్దిదారులకు ఆయన కార్డులను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో కూడా లేనిఅనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయని అన్నారు. పనిచేసే వారికే ఓటు అడిగే నైతిక హక్కు ఉందని అది కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్ళల్లో కుటుంబ పెద్దగా కేసీఆర్ అండగా నిలిచారని తెలిపారు, గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నయన్నారు, రాజకీయాలకు తావులేకుండా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, దేశాన్ని పాలించే ప్రధాని సొంత రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇవ్వడంలేదని స్పషం చేశారు, అర్హులైన వారందరికీ మళ్లీ పెన్షన్లు మంజూరు చేస్తామని, కేసీఆర్ పాలనలోనే తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అందుకే పేదల గుండెల్లో సిఎం కేసీఆర్ నిలిచారని అన్నారు, అనంతరం గ్రామానికి చెందిన పది మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.