Chityala

ఉదయ హృదయాన్ని చాటుకున్న స్నేహితులు

Submitted by Sathish Kammampati on Tue, 20/09/2022 - 11:15

చిట్యాల సెప్టెంబర్ 19(ప్రజాజ్యోతి)../ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల1990 -1991 పూర్వ విద్యార్థులు తమ తోటి స్నేహితులు బద్దుల యాదయ్య తండు శ్రీనివాస్ చనిపోవడంతో వారి భార్య లగు బద్దుల సుజాత తండురమ మరియు స్నేహితురాలు దర్శి పద్మ లకు ఒక్కొక్కరికి 10500 చొప్పున ఆర్థిక సహాయం అందజేసినారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రవణ్ కుమార్ 21000 రూపాయలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ సర్పంచ్ జిట్ట నగేష్, గుండెబోయిన సైదులు, బొక్క పురుషోత్తం రెడ్డి, కౌన్సిలర్ బెల్లి సత్తయ్య, మారగొని రమేష్, జంపాల వెంకన్న, గంటా శ్రీనివాసరెడ్డి, చెరుపల్లి శ్రీనివాస్, మన్నెం దుర్గయ్య,

ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు.

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 16:17

చిట్యాల ప్రజా జ్యోతి సెప్టెంబర్ 17, .  భారతీయ జనతా పార్టీ  మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  72వ జన్మదిన వేడుకల బిజెపి మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్  ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

ధర్మకర్తల నియామకానికి నోటిఫికేషన్ జారీ

Submitted by Sathish Kammampati on Sat, 17/09/2022 - 16:14

చిట్యాల సెప్టెంబర్ 17(ప్రజాజ్యోతి)///. చిట్యాల పురపాలిక కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలి నియామకానికి రాష్ట్ర దేవాదాయ శాఖ ఎండోమెంటు యాక్ట్, 30/ 1987 ప్రకారం నోటిఫికేషన్ ను ఈనెల 14న విడుదల చేసింది. నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుండి 20 రోజులలోపు ఆసక్తి గల అభ్యర్థులు  దేవాదాయ శాఖ సహాయక కమిషనర్, జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని దేవాదాయ శాఖ మండల అధికారి అంబటి నాగిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పైళ్ల మల్లారెడ్డి చిత్రపటానికి నివాళి

Submitted by Sathish Kammampati on Sat, 17/09/2022 - 16:09

చిట్యాల సెప్టెంబర్ 17(ప్రజాజ్యోతి)//. నల్లగొండ జిల్లా:కమ్యూనిస్టుల పోరాటం వల్లే నిజాం లొంగుబాటు  సిపిఎం చిట్యాల మండల కమిటీ సభ్యులు నెలికంటి నరసింహ,పంది నరేష్ అన్నారు.శుక్రవారం వెలిమినేడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట  వారోత్సవాల్లో భాగంగా వెలిమినేడులో పైళ్ల మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళిలార్పించడం జరిగింది.తెలంగాణలో దొరలు జాకీర్దారులు దేశ్ముకులు భూస్వాములు నైజాముకు తొత్తులుగా మారి రైతు వ్యవసాయ కూలీలపై వృత్తిదారులపై జరుగుతున్న దాడులను దౌర్జన్యాలను అత్యాచారాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం పోరాటం చేసిందని తెలిపారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ జెండా ఆవిష్కరణ

Submitted by Sathish Kammampati on Sat, 17/09/2022 - 15:55


చిట్యాల సెప్టెంబర్ 17(ప్రజాజ్యోతి)//. 75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా పెద్దకాపర్తి గ్రామపంచాయతీ పరిదిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు రామలింగాచారి ఉదయం 9.30 నిమిషాలకు జాతీయ జెండా ఎగురవేయడం  జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మర్రి జలంధర్ రెడ్డి, ఉప సర్పంచ్ నూతి సత్య శ్రీ వెంకటేశం,హై స్కూల్ చైర్మన్ ఆవుల మంజుల జానయ్య, వైస్ చైర్మన్ నీలకంఠం నరేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాటం వెంకటేశం,వార్డు సభ్యులు,ప్రజాపతినిధులు,ఉపాధ్యాయులు,అధికారులు,గ్రామప్రజలు, పాల్గోని విజయవంతం  చేశారు.

ప్రతి బూతులో జెండా ఎగరవేయాలి

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 13:15

 చిట్యాల ప్రజా జ్యోతి సెప్టెంబర్ 16. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు బూత్ అధ్యక్షులకు మండల నాయకులకు వివిధ మోర్చాల అధ్యక్షులు కార్యదర్శులు జిల్లా నాయకులు సానుభూతిపరులు అభిమానులు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి బూత్ లో జాతీయ జెండా ఎగురవేయాలని మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ కోరారు.అనంతరం చిట్యాల మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  జన్మదిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  కావున ప్రతి ఒక్క  కార్యకర్త హాజరుకావాలని బుర్ర వెంకటేష్ గౌడ్ తెలిపారు

సాయుధ పోరాట యోధులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారు క్షమాపణ చెప్పాలి

Submitted by Sathish Kammampati on Fri, 16/09/2022 - 15:04

కెవిపియస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్,గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య లు  డిమాండ్

తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి -రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండ శ్రీశైలం

Submitted by Sathish Kammampati on Fri, 16/09/2022 - 15:02

చిట్యాల సెప్టెంబర్ 16(ప్రజాజ్యోతి). నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లో ఈ నెల 22 వ తేదీ  నుండి జరుగనున్న తెలంగాణా రైతు సంఘం నల్లగొండ జిల్లా మహాసభలను జయప్రధం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీ శైలం రైతులకు  విజ్ఞప్తి చేశారు. చిట్యాల మండలం కేంద్రంలో ని స్థానిక మేకల లింగయ్య స్మారక భవనం లో శుక్రవారం నాడు జరిగిన రైతు సంఘం మండల జనరల్ బాడీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.జిల్లా మహా సభలకు సంఘం రాష్ట్ర అధ్యక్షు,కార్యదర్శి లు పోతినేని సుదర్శన్,టి.సాగర్,మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి తదితర నాయకులు హాజరై ప్రసంగించనున్నట్లు తెలిపారు.