కస్తూర్బా హాస్టల్ లో పోషణ మాసం

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:05
Nutrition Month at Kasturba Hostel

 చిట్యాల ప్రజా జ్యోతిసెప్టెంబర్ 21, ..../ మండలంలోని కస్తూరిబా హాస్టల్ లో పిల్లలకు పోషణ మాసం  సమావేశం ఏర్పాటు చేసి పిల్లలు తీసుకోవలసిన ఆహారము వ్యక్తిగత శుభ్రత విద్య  ప్రాముఖ్యత బాల్య వివాహము జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై జయప్రద సూపర్వైజర్ వివరించారు ముఖ్యంగా ఎదిగే బాలికలు కాబట్టే కాబోయే తల్లులు అన్ని రకాల ఆహార పదార్థాలు పండ్లు,పాలు, ఆకుకూరలు,కూరగాయలు, మొలకెత్తించిన గింజలు, పల్లి బెల్లం, సమపాళ్లలో భుజించి రక్తహీనత రాకుండా పోషకాహార లోపానికి గురికాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు అని అన్నారు. చదువు పైన మంచి ఆలోచనతో అన్ని రంగాలలో మొదటి స్థానంలో ఉంటారని ముఖ్యంగా సెల్ ఫోన్స్ కి దూరంగా ఉండాలని మగ పిల్లలు ఎక్కడ కనిపించినా సోదర భావంతో మెలగాలని ఇటువంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా స్కూల్ టీచర్స్ తల్లిదండ్రులు చెప్పిన మాటలే వినాలని బయట వారు చెప్పిన మోసపూరితమైన ప్రలోభాలకు ఆకట్టుకునే విషయాలపై శ్రద్ధ చూపెట్టకుండా ఉండాలని వివరించారు.ఈ కార్యక్రమంలో కస్తూరిబా స్పెషల్ ఆఫీసర్ సుమలత,ఇన్చార్జి ఆసీనా, అంగన్వాడీ టీచర్స్ సంధ్యారాణి,భాగ్యలక్ష్మి,అరుణ, భాగ్యమ్మ,జ్యోతి లు పాల్గొన్నారు.