కొడకండ్ల

కార్తీక మాసం సందర్భంగా అఖండ దీపాన్నివెలిగించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Submitted by narmeta srinivas on Mon, 07/11/2022 - 20:06

విశిష్ట అతిథిగా ఉత్తర కాశీపీఠాధిపతి స్వామి స్థిత ప్రజ్నానంద సరస్వతి

జనగామ / పాలకుర్తి (ప్రజాజ్యోతి) నవంబర్ 07  :  జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం గుట్టపై కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా అఖండ దీపాన్ని సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెలిగించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఉత్తర కాశీపీఠాధిపతి స్వామి స్థిత ప్రజ్నానంద సరస్వతి హాజరయ్యారు.

మహాదేవాలయంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా కార్తీక సోమవారం

Submitted by narmeta srinivas on Mon, 07/11/2022 - 19:32

శివనామస్మరణతో మార్మోగిన మహాదేవాలయం

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 07 : కొడకండ్ల మండల కేంద్రంలోని  అతి పురాతనమైన శివాలయంలో కార్తీక సోమవారాన్ని ఘనంగా నిర్వహించారు. మహిమాన్విత మహాదేవాలయం ఉదయం నుండి రాత్రి వరకు శివనామస్మరణతో మార్మోగింది. సోమవారం ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకున్నారు. భక్తులు మహాదేవునికి పంచామృతాలతో మహాన్యాస పూర్వక అభిషేకాలు, పుష్పార్చన, కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాధన వితరణ జరిపారు.

శనైశ్చర ఆలయంలో ఘనంగా శని త్రయోదశి నిర్వహణ

Submitted by narmeta srinivas on Sat, 05/11/2022 - 17:16

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 05 : కొడకండ్ల మండల కేంద్రంలోని శనైశ్చర ఆలయంలో శనివారం ఘనంగా శని త్రయోదశి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వామి పిండిపోలు మౌర్య శర్మ మాట్లాడుతూ భక్తులకు కొంగుబంగారమైన శనైశ్చర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా శనైశ్చర స్వామికి నువ్వుల నూనెతో పంచామృతాలతో అభిషేకం చేసి శని గ్రహ మూలమంత్ర హోమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ దేవాలయంలో శని గ్రహ దోష నివారణ పూజలు, సత్వర వివాహం, సంతానం, ఉద్యోగం,ఆరోగ్యం కలగడానికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అఖండ దీపోత్సవ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లిని ఆహ్వానించిన ఆలయ పాలకమండలి

Submitted by narmeta srinivas on Fri, 04/11/2022 - 17:50

అఖండ దీపోత్సవ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ

జనగామ /పాలకుర్తి (ప్రజాజ్యోతి) నవంబర్ 04 :పాలకుర్తి లోని శ్రీ చండిక సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కార్తిక మాస ఉత్సవాల సందర్భంగా ఈనెల 7 న నిర్వహిస్తున్న అఖండ దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను ఆలయ పాలకమండలి,ఆలయ ఈఓ రజని కుమారి శుక్రవారం హనుమకొండ లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కలిసి ఆహ్వానించారు.

పుట్టినరోజు సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి ఆశీర్వాదం తీసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు మొహమ్మద్ షన్నా

Submitted by narmeta srinivas on Fri, 04/11/2022 - 13:05

షన్నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి


పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 04 :  తెలంగాణ ఉద్యమకారుడు మొహమ్మద్ షన్నతన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌ రావును శుక్రవారం హన్మకొండ లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్యమ కారుడు షన్నాను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమంలో షన్నాతదితరులు పాల్గొన్నారు.

కొడకండ్ల మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ

Submitted by narmeta srinivas on Wed, 02/11/2022 - 20:16

పలు అంశాలపై సుదీర్ఘ చర్చ

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజా జ్యోతి) నవంబర్ 02 : కొడకండ్ల మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ధరావత్ జ్యోతి రవీంద్ర గాంధీ నాయక్ అధ్యక్షతన బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ పేరం రాము పాల్గొన్నారు. సమావేశంలో మండలంలోని గ్రామాలలో జరుగుతున్న పలు పనులు, సమస్యలు, పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు.

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత, కేసు నమోదు

Submitted by narmeta srinivas on Wed, 02/11/2022 - 19:12

పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజా జ్యోతి )  నవంబర్ 02 : మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 23 క్వింటాళ్ళ పిడిఎస్  బియ్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసిన ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

ఈ దీపావళికి కొత్త నోములు లేవు ,ఈ నెల 24న నరకచతుర్దశి ,25 న దీపావళి పండుగ

Submitted by narmeta srinivas on Mon, 17/10/2022 - 18:47

రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి : పిండిపోలు నాగ దక్షిణామూర్తి