జోగులాంబ గద్వాల్

దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు అన్నటు ఆసరా లేని వారికి కేసిసిర్ రే ఆసరా

Submitted by sridhar on Mon, 05/09/2022 - 16:40
  • తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పధకాలు దేశానికి ఆదర్శం.

   (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 5. అల్లంపూర్: ఇటిక్యాల మండల ప్రజా పరిషత్ ఆఫీస్ నందు వివిధ గ్రామాల వారికి 1415 మంది లబ్ధిదారులకు  ఆసరా పెన్షన్ కార్డులు మరియు వివిధ గ్రామాల వారికి 10 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాది ముబరకు చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పంపిణీ చేసిన అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం.జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.సరిత.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని ఆయన అన్నారు.

శ్రీ సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Submitted by sridhar on Mon, 05/09/2022 - 15:07

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 05 :1988-1989 10వతరగతి పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.సోమవారం గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుల తల్లి  శ్రీ సరస్వతి దేవి  నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే .  భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ  జయంతిని పురస్కరించుకొని  ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Submitted by sridhar on Mon, 05/09/2022 - 15:00

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 05 : సోమవారం గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం కేంద్రంలోని మండలం ప్రాథమిక ఉన్నత పాఠశాల లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే  భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణగారి జయంతిని పురస్కరించుకొని  ఆయన విగ్రహానికి  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.పాఠశాల చిన్నారులు ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం పలికారు

సమాజాభివృద్ధికి విద్యయే మూలం

Submitted by sridhar on Mon, 05/09/2022 - 14:52


◆ ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న
◆జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ
◆జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

మిని బస్ షెల్టర్ లను ఏర్పాటు చేయాలని డిమాండ్

Submitted by Ashok Kumar on Sat, 03/09/2022 - 15:28

గద్వాల : ప్రజాజ్యోతి ప్రతినిధి:- గద్వాల్ నుండి ఎర్రవల్లి,ఐజ బయలుదేరు ఉద్యోగులు,ప్రయాణికులు నిత్యం ప్రభుత్వ ఆస్పత్రి,కోర్టు పనుల మీద కానీ ఎమ్మార్వో కార్యాలయం కు కానీ అనునిత్యం గద్వాల్ కు ఆయా పనులమీద రాకపోకలు కొనసాగిస్తుంటారు.ఇలా వస్తున్న సమయంలో బస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఎండలో నిలబడలేక ప్రయాణికులు,ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తీవ్ర అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది..ఒక్కోసారి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రోగులు డిచార్జ్ అయిన సమయంలో రోడ్డు నిల్చోలేక (నిలబడలేక) మళ్లీ అస్వస్థకు గురి అయి మళ్లీ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోజులు కూడా ఉన్నాయని ప్రయాణి

స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి(తిమ్మప్ప స్వామి) దేవాలయంలో అన్నదానం

Submitted by Ashok Kumar on Sat, 03/09/2022 - 15:25

గద్వాల జిల్లా (ప్రజాజ్యోతి ప్రతినిది) సెప్టెంబర్ 03 : జోగులాంబ గద్వాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు తాటికుంట గ్రామానికి చెందిన తిమ్మయ్య శెట్టి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి, అర్చకులుమధుసూదనాచారి, రమేష్, రవి, దీరేంద్ర దాస్ పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీతారామ్ రెడ్డి మధుసూదన్ రెడ్డి సవారన్న బ్యాంక్ నాగరాజు బాదామి శ్రీనివాసులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బి ఎస్ కె యూత్ గణేష్ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి జిల్లా అధ్యక్షులు

Submitted by Ashok Kumar on Sat, 03/09/2022 - 13:11

గద్వాల జిల్లా (ప్రజాజ్యోతి ప్రతినిది) సెప్టెంబర్ 03:గద్వాల జిల్లా కేంద్రంలోని వినాయక చవితి సందర్బంగా శనివారం 28వ వార్డ్ శేరెల్లివీధి నందు బి ఎస్ కె యూత్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుని పూజ కార్యక్రమంలో పద్మశాలి జిల్లా అధ్యక్షులు పులిపాటి వెంకటేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి కాడిగిరాము,కౌన్సిలర్ శ్రీమన్నారాయణ  పాల్గొన్ని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.స్వామి వారి తీర్థ ప్రసాదాలు తీసుకొని వినాయకుని ఆశీస్సులు పొందడం జరిగింది.అనంతరం చైర్మన్ బి.యస్.కేశవ్ పద్మశాలి జిల్లా అధ్యక్షులు,పట్టణ ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ కు శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ పూజ కార్యక్

ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా పరిషత్ ఉపముఖ్యకార్యనిర్వాహణ అధికారి

Submitted by Ashok Kumar on Fri, 02/09/2022 - 17:32

గద్వాల జిల్లా (ప్రజాజ్యోతి ప్రతినిది) సెప్టెంబర్02 : జోగులాంబ గద్వాల జిల్లా  వడ్డేపల్లి మండల పరిధిలోని కొంకల గ్రామములో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను  శుక్రవారం జిల్లా పరిషత్ ఉపముఖ్యకార్యనిర్వహణ అధికారి ముషాహీదా బేగం సందర్శించారు. పాఠశాల విద్యార్థిని,విద్యార్థుల తో ముచ్చటించారు. అందరు క్రమశిక్షణ తో ,ప్రణాళిక బద్దంగా చదవాలని ఆమె అన్నారు. పాఠశాలలో అమలు అవుతున్న మధ్యహణ భోజన పథకం ను పరిశీలించి , నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం  అందివ్వాలని వంట ఏజెన్సీ నిర్వాహకులకు ఆదేశించారు. అలాగే గ్రామంలో జరుగుతున్న ఒడిఫ్ ప్లస్  సర్వే ను పరిశీలించారు.

జోగుళాoబ గద్వాల్ జిల్లా పోలీస్ మరణించిన పోలీసు కుటుంబానికి ఆర్ధిక భద్రత కల్పించిన జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారు

Submitted by Ashok Kumar on Fri, 02/09/2022 - 12:30

పత్రికా ప్రకటనతేది:01.09.2022.  జోగుళాoబ గద్వాల్ జిల్లా రాజోలి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఈ శంకర్ గౌడ్ గారు గత సంవత్సరం జనవరి నెలలో ఆక్సిడెంట్ లో మరణించగా ఈ రోజు వారీ తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారి చేతులమీదుగా భద్రత  ఎక్స్ గ్రేషియా లో భాగంగా 8 లక్షల రూపాయల చెక్ లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలకు అన్ని వేళలా అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు.

నిర్మాణం లో ఉన్న నూతన జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయంను సందర్శించిన జిల్లా ఎస్పీ

Submitted by Ashok Kumar on Thu, 01/09/2022 - 18:57

గద్వాల్ జిల్లా (ప్రజాజ్యోతి ప్రతినిది)సెప్టెంబర్ 01 : జిల్లా కేంద్రం లోని పిజెపి క్యాంప్ నందు  నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయం ను   జిల్లా ఎస్పీ  జె. రంజన్ రతన్ కుమార్  సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను   పరిశీలించారు, కార్యాలయాల సముదాయాల పనులు జరుగుతున్న తీరును, కార్యాలయానికి వేస్తున్న అప్ప్రోచ్ రోడ్ ను పరిశీలించారు.  ఇంకా పూర్తి చేయాల్సిన పనులు తదితర వివరాలను కాంట్రాక్టర్ బాలీశ్వర్ రెడ్డి  జిల్లా ఎస్పీ కి   వివరించారు.