పోంచపల్లి

రాష్ట్ర చేనేత ఐక్య వేదిక నూతన ప్రమాణ స్వీకారం

Submitted by krishna swamy on Sun, 11/09/2022 - 17:56

రాష్టం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన చేనేత నాయకులు కార్మికులు

భక్తి పారవశ్యంతో గణపయ్య శోభాయాత్ర

Submitted by krishna swamy on Sat, 10/09/2022 - 16:40

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి)  మండలంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవస్థానంలో అభినవ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా గణపతి నవరాత్రోత్సవలలో భాగంగా శుక్రవారం ఉదయం మహాగణపతి హోమం , తదుపరి మహా అన్నదాన కార్యక్రమము మరియు  స్వామివారి రథోత్సవం నిమర్జనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సహకరించిన దాతలకు, ముఖ్య అతిధిలకు అభినవ యూత్ అధ్యక్షుడు వర్కాల గణేష్ కుమార్ సన్మానం చేసి  గౌరవించారు. అనంతరం వినాయక నిమజ్జన శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

Submitted by krishna swamy on Sat, 10/09/2022 - 15:13

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 09 (ప్రజా జ్యోతి)  తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరం అని సర్పంచ్ మట్ట బలమని సుదర్శన్ గౌడ్ అన్నారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని పెద్ద రావులపల్లి గ్రామంలో స్థానికఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ్ చేతుల మీదుగా బాధితులు ఆకుల మంజుల 12 000 మాటూరి నరసింహ 11000 రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

Submitted by krishna swamy on Thu, 08/09/2022 - 17:29

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 08 (ప్రజా జ్యోతి) భూదాన్ పోచంపల్లి పట్టణ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం నుండి మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ 20 వేల చెక్కును 12వ వార్డుకు చెందిన కైరంకొండ బాలయ్యకు  స్థానిక కౌన్సిలర్ దేవరాయ కుమార్ చేతులమీదుగా  చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ కార్యదర్శి సీత శ్రవణ్ కుమార్, సంగెం చంద్రయ్య, దోర్నాల గణేష్, పగడాల పాండు, నాగేష్  పాల్గొన్నారు.

పద్మశాలి యువజన సంఘం సన్మానం

Submitted by krishna swamy on Thu, 08/09/2022 - 12:15

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 07 (ప్రజా జ్యోతి) పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో పోచంపల్లి కో-అపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన్ చైర్మన్ గా ఎన్నికైన కర్నాటి బాలసుబ్రహ్మణ్యం వైస్ చైర్మన్ సూరపల్లి రమేష్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు సూరపల్లి రాము మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి- పాటి సుధాకర్ రెడ్డి టీఆరెస్ మండల పార్టీ అధ్యక్షుడు

Submitted by krishna swamy on Tue, 06/09/2022 - 16:44

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 06 (ప్రజా జ్యోతి) తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని టిఆరస్ మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి కోరారు.మండలంలోని జూలూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కులను గ్రామ సర్పంచ్ యకరి రేణుక నర్సింగరావు టీఆరెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి ఎంపీటీసీ బొచ్చు  శంకరమ్మ  కిష్టయ్య చేతుల మీదుగా లబ్దిదారులు  మల్యాల ఈశ్వరమ్మ  బత్తుల జయలక్ష్మి  అందజేశారు.

భక్తి శ్రద్ధలతో వినాయక ఉత్సవలు జరుపుకోవాలి -జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Submitted by krishna swamy on Tue, 06/09/2022 - 16:28

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 05 (ప్రజా జ్యోతి) ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో వినాయక ఉత్సవలు జరుపుకోవాలి అని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగాభూదాన్ పోచంపల్లి పట్టణంలోని టై & డై అసోసియేషన్, లక్ష్మణ్ నగర్, లక్ష్మి నారాయణ నగర్, నేతాజీ యువజన సంఘం, రేవనపెల్లి, 4 వార్డ్ ఇతర వినాయక మండపాలను సందర్శించి, నిమజ్జన కార్యక్రమం లో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విద్యార్థులకు పరిశుభ్రమైన భోజనం అందించాలి- ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి

Submitted by Sathish Kammampati on Tue, 06/09/2022 - 14:14
  • కస్తూరిభా మోడల్ స్కూల్లను తనిఖీ చేసిన ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్
  • స్వయంగా భోజనం రుచి చూసిన వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 05 (ప్రజా జ్యోతి) భూదాన్ పోచంపల్లి మండలంలోని కస్తూరిభా పాఠశాల మరియు మోడల్ స్కూల్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనమును పరిశీలించారు. అలాగే విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యతతో కూడిన పరిశుభ్రమైన భోజనం అందించాలని ఆదేశించారు.