Narketpalle

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

Submitted by Sathish Kammampati on Thu, 22/09/2022 - 14:03

నార్కట్ పల్లి, సెప్టెంబర్ 21( ప్రజాజ్యోతి): మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి  చెందిన భీమన బోయిన మల్లయ్య గత పది రోజుల  క్రితం అనారోగ్యంతో  మరణించడం జరిగింది. ఇట్టి విషయం  కాంగ్రెస్ పార్టీ వడ్డేపల్లి ఎక్స్ సర్పంచ్ తల్లోజు హనుమంతచారి ద్వారా సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి  మృతుని  కుటుంబ సభ్యులకు 15000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.

సాధనతో లక్ష్యం సాధికారిత ఎస్సై బోడి గే రామకృష్ణ గౌడ్

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 10:44

 కరాటే లో ప్రతిభ కనబరిచిన  శ్రీ కృష్ణవేణి పాఠశాల విద్యార్థులకు సన్మానం 

జర్నలిస్టు ఎండి సాదత్ అలి కి ఘన సన్మానం.

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 11:43

నార్కట్ పల్లి సెప్టెంబర్ 18  ( ప్రజా జ్యోతి)//.  తెలంగాణ జాతీయ సమైక్యతవజోత్సవాలు లో బాగంగాస్వాతంత్ర్యసమరయోధులకు, తెలంగాణఉద్యమకారులకు, ,కవులకు,కళాకారులకు,జర్నలిస్టులకు,సన్మాన కార్యక్రమము లో భాగంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో ఆదివారం నకరేకల్ లో నవ తెలంగాణ జర్నలిస్ట్ ఎండి సాదత్ అలి కి  సన్మానం జరిగింది. మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని ప్రజల పక్షాన కథనాలు రాసి  చైతన్య పరిచినందుకు గాను మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బిసి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల  శం బయ్య  చేతుల మీదుగా సన్మానించారు.

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం ప్రారంభోత్సవం

Submitted by Sathish Kammampati on Thu, 15/09/2022 - 15:57

నార్కట్ పల్లి; సెప్టెంబర్ 15( ప్రజా జ్యోతి).   మహాత్మ జ్యోతిరావు పూలే తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల పాఠశాల నార్కట్ పల్లి లో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు సూది రెడ్డి నరేందర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే  చదువుల్లో గాని، క్రీడల్లో గాని రాణించడం జరుగుతుందని، అదేవిధంగా మంచి  మనో వికాసమున కు నులిపురుగుల నివారణ అవసరమని، ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు విద్యార్థులు  నమిలి  తినాలి అని విద్యార్థులకు ఈ సందర్భంగా తెలిపారు.

డ్రగ్స్ సేవించడం చట్ట వ్యతిరేకం ఎస్సై బొడిగె రామకృష్ణ గౌడ్

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 12:38

నార్కట్ పల్లి; సెప్టెంబర్ 13( ప్రజా జ్యోతి)  హానికరమైన గంజాయి స్టెరాయిడ్ లాంటి ప్రమాదకరమైన డ్రగ్స్ సేవించడం చట్ట వ్యతిరేకమని స్థానిక ఎస్సై బొడిగె రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు మంగళవారం స్థానిక కామినేని వైద్య విద్య కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగము, చట్టంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్యసాధన దిశగా కృషి చేయాలన్నారు. మాదకద్రవ్యాలు సేవించడం పట్ల అద్భుత శక్తి వస్తుందని మూఢనమ్మకాలను నమ్మవద్దని సూచించారు. మాదకద్రవ్యాలు సేవించడం క్రయ విక్రయాలు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు.

నార్కట్ పల్లి లో నిత్యం జనగణమన భేష్.

Submitted by Ramakrishna on Sat, 10/09/2022 - 15:21

kaనార్కట్ పల్లి. సెప్టెంబర్ 9( ప్రజా జ్యోతి) భారతదేశానికి వన్నె తెచ్చే  జాతీయ గీతం   జనగణమన నిత్యం నార్కట్ పల్లి లోఆలపించడం గర్వించదగ్గ విషయమని  జనగణమన ఉత్సవ సమితి నల్గొండ.అధ్యక్షుడు  కర్నాటి విజయ్ కుమార్ , ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రారంభమైన నిత్యం జనగణ ఆలాాపన కార్యక్రమంలో వారు శుక్రవారం  పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగఫలంతో సిద్ధించిన స్వాతంత్రాన్ని స్మరించుకుంటూ నిత్యం జనగణమన ఆలపించడం అభినందనీయం అన్నారు.ఈ మహోత్స ర.