పాలకీడు

మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించిన ఎం పి పి గోపాల్

Submitted by Ramesh Peddarapu on Mon, 03/10/2022 - 15:12


పాలక వీడు,అక్టోబర్2(ప్రజా జ్యోతి):  పాలక వీడు మండలఎంపిడిఓ కార్యాలయంలో జాతి పిత మహాత్మా    గాంధీ జయంతి సంద్భంగా
 ఎంపిపి గోపాల్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.దేశానికి స్వాతత్య్రం రావడానికి అయన చేసిన శాంతీయుత పొరటాల గురించి గుర్తుచేసుకున్నారు.కార్యక్రమంలో ఎంపిడిఓ వేంకటచారి,వైస్ ఎంపిపి పిన్నెల్లి ఉపేందర్,పెట్టేతండా సర్పంచ్ మలోతు మోతీలాల్,ఎంపిఓ దయాకర్,కంప్యూటర్ ఆపరేటర్ పిచ్చయ్య,ఆఫీస్ సిబ్బంది తదితరులు       పాల్గొన్నారు.

యల్లాపురం లో అన్నదానం చేసిన టి ఆర్ యస్ నాయకులు

Submitted by Ramesh Peddarapu on Mon, 03/10/2022 - 15:10

పాలక వీడు,అక్టోబర్2(ప్రజా జ్యోతి): పాలక వీడు మండలoయల్లాపురం గ్రామంలో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేరేడుచర్ల మార్కెట్ డైరెక్టర్ తీగల శేషిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమాని ప్రారంభించిన తెరాస మండల అధ్యక్షులు కె అంజిరెడ్డి,  దర్గారావు ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, తెరాస మండల నాయకులు సైదులు, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గో న్నారు.

ఘనంగా గాంధీ జయంతి

Submitted by Ramesh Peddarapu on Mon, 03/10/2022 - 15:05

పాలకీడు,అక్టోబర్2(ప్రజా జ్యోతి):   పాలక వీడు మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు మా శెట్టి లక్ష్మయ్య,ప్రధాన కార్యదర్శి జనపల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారి యాద ఈశ్వరయ్య, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  పాలకీడు మండల ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్, పాలక వీడు సర్పంచ్ బైరెడ్డి నాగలక్ష్మి,సర్పంచ్ మోతిలాల్,సిపిఎం మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్,పిఎసిఎస్ చైర్మన్ వై  సత్యనారాయణరెడ్డి,వైస్ చైర్మన్ పగడాల మట్టయ్య, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

బీసీల నుంచి ఒక్క సీఎం కాకపోవడం దురదృష్టకరం

Submitted by Ramesh Peddarapu on Mon, 03/10/2022 - 15:02

 పాలక వీడు,అక్టోబర్2(ప్రజా జ్యోతి):     స్వాతంత్రం వచ్చింది మొదలుకొని నేటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణలో కానీ ఒక్క బిసి  వ్యక్తి కూడా సీఎం కాకపోవడం దురదృష్టకరమని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు వ్యాఖ్యానించారు.

పాలకీడు మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడి గా మాశెట్టి లక్ష్మయ్య ఎన్నిక

Submitted by Ramesh Peddarapu on Fri, 30/09/2022 - 11:49

పాలక వీడు,సెప్టెంబర్29(ప్రజా జ్యోతి):  సూర్యాపేట జిల్లా పాలకీడు మండల ఆర్యవైశ్య సంఘమునకు నూతన అధ్యక్షులుగా 25-09- 2022 ఆదివారం ఉదయం 11:30 నిమిషాలకు పాలకీడు లో జరిగిన మండల జనరల్ బాడీ సమావేశము నందు మాశెట్టి లక్ష్మయ్య ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభాధ్యక్షులుగా తక్షణ మాజీ అధ్యక్షులు పోలిశెట్టి రాంబిక్షం  వహించగా ప్రధాన కార్యదర్శి గుండా బిక్షపతి  రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్  యుటిఎఫ్ నాయకులు గతములో నిర్వహించిన కార్యక్రమాలు సభకు వివరించారు.

పోడు భూములు పై అవగాహన సదస్సులో పాల్గొన్న డి యప్ ఓ సతీష్

Submitted by Ramesh Peddarapu on Fri, 30/09/2022 - 10:57

పాలక వీడు,సెప్టెంబర్29(ప్రజా జ్యోతి); పాలకీడు మండలం గుడుగుంట్ల పాలెం గ్రామపంచాయతీ రైతు వేదికలో గురువారం రోజు పోడు భూముల దరఖాస్తుల గురించి, ఎఫ్ ఆర్ సి కమిటీ గురించి సూర్యాపేట జిల్లా డిఎఫ్ ఓ సతీష్ చే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకీడు ఎమ్మార్వో శ్రీదేవి, ఎంపీడీవో వెంకటాచారి, ఎంపిఓ దయాకర్,ఫారెస్ట్ అధికారులు, మండల రెవెన్యూ ఆఫీస్ సిబ్బంది, ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

బతుకమ్మ సంబరాలు

Submitted by Ramesh Peddarapu on Thu, 29/09/2022 - 14:02


పాలకీడు, సెప్టెంబర్28(ప్రజా జ్యోతి): పాలకీడు మండలం కోమటికుంట గ్రామంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో మూడో రోజు ఆయన బుధవారం రోజు నానబియ్యం బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా పూలు అలంకరించి బతుకమ్మలు ఆడుతున్న మహిళలు,చిన్నారులు.

అందే మల్లయ్య.విగ్రహ ఆవిష్కరణ లో పాల్గొన్న యం పి ఉత్తమ్ పార్టీలకు అతీతంగా వచ్చిన నేతలు

Submitted by Ramesh Peddarapu on Thu, 29/09/2022 - 12:20

పాలక వీది,సెప్టెంబర్28(ప్రజా జ్యోతి):   ఉమ్మడి నేరేడుచర్ల మాజీ ఎంపీపీ, మార్కెట్ కమిటీ చైర్మన్, బొత్తల  పాలెం గ్రామ సర్పంచిగా నిస్వార్థపూరిత సేవలు అందించిన నాయకుడు స్వర్గీయ అందె  చిన్న మల్లయ్య అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పిన విజయ్ సింహారెడ్డిలు కొనియాడారు.  బోత్తల  పాలెం గ్రామంలో ఆయన విగ్రహ ఏర్పాటు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు, వివిధ పార్టీల నాయకులు హాజరై విజయవంతం చేశారు. చిన్న మల్లయ్య సేవలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని పలువురు నాయకులు నెమరు వేసుకున్నారు.