గద్వాల్

మహాత్మా గాంధీ విగ్రహం ముందు వీఆర్ఏల మౌన దీక్ష

Submitted by bheemaraidu on Mon, 03/10/2022 - 13:48

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) అక్టోబర్ 02 :  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు వీఆర్ఏల రాష్ట్ర వ్యాప్త సమ్మె 70వ, రోజు పేస్కేల్ సాధనకై గద్వాల తహసిల్దార్ ఆవరణలో గ్రామ రెవెన్యూ సహాయకుల 70వ, రోజు నిరసన, గాంధీ జయంతి సందర్భంగా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జోగులాంబ గద్వాల జిల్లా జేఏసీ అధ్యక్షులు బి.రాములు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి 2020 సంవత్సరం సెప్టెంబర్ నెల 9వ, తారీఖున నిండు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని, వీఆర్వో వ్యవస్థ రద్దు అయినందున వీఆర్ఏలకు అందరికీ పేస్కేలు కల్పించి, అలాగే అర్హత ఉన్న వీఆర్ఏలకు అందరికీ ప్రమోషన

ఘనంగా మూలా నక్షత్ర దీపోత్సవం

Submitted by bheemaraidu on Mon, 03/10/2022 - 13:22

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) అక్టోబర్ 02 :  జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని ఆదిశిలా క్షేత్రం శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం మూలా నక్షత్ర దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉదయం దేవాలయంలో పంచామృతాభిషేకాలు, ద్విపోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీదేవిని, శారదా దేవి అలంకరణలో పూజా కార్యక్రమం జరిగింది. శ్రీనివాస సిద్ధాంతి, శ్రీనివాస కళ్యాణం గురించి భక్తులకు పురాణ ప్రవచనాలు వినిపించారు.

భక్తిశ్రద్ధలతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Submitted by bheemaraidu on Mon, 03/10/2022 - 13:20

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) అక్టోబర్ 02 :  శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజు ఆశ్వీజ శుద్ధ సప్తమి ఆదివారం (ములానక్షత్రం) జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో వెలసిన శ్రీరాజరాజేశ్వరి దేవి, చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా, సరస్వతీ దేవిని పురాణాలు వర్ణించాయి. ఆమె సంగీత, సాహిత్యాలకు అధిష్టాన దేవత. మానవులందరికీ సకల విద్యలను ప్రసాదించి వారిలో జ్ఞాన దీపాన్ని వెలిగించే విద్యాశక్తి.

శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి

Submitted by bheemaraidu on Mon, 03/10/2022 - 13:17

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) అక్టోబర్ 02 :  జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు ఆశ్వీజశుద్ధ సప్తమి ఆదివారము (మూలా నక్షత్రం)రోజున సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతిగా త్రిశక్తి స్వరూపిని అయిన దుర్గాదేవి తన అంశంలోని నిజరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే మూలా నక్షత్రం నాడు చేసే సరస్వతి అలంకారం ప్రత్యేకత. తెల్లని పట్టుచీర ధరించి, చేతిలో వీణతో సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి జన్మ నక్షత్రం రోజున దర్శించుకుంటే భక్తుల కష్టాలు తీరతాయని కోరిన విద్యలు వస్తాయని నమకం.

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

Submitted by bheemaraidu on Sat, 01/10/2022 - 13:11

గద్వాల ప్రతినిధి (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 30 :  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పద్మశాలీల శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో శుక్రవారం అమ్మవారు శ్రీ ధనలక్ష్మి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకరణకు సుమారు ఒక లక్ష 116 రూపాయల కొత్త కరెన్సీ నోట్లను ఉపయోగించినట్లు అర్చకులు రామాచారి జోషి తెలిపారు. ఉదయం అమ్మవారికి అభిషేకం, అలంకరణ, మంగళహారతి, తీర్థ ప్రసాదముల వితరణ, సాయంత్రం కుంకుమార్చనలు, సాంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు.

ఐఐటీలో సిఎస్ఈ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే

Submitted by bheemaraidu on Sat, 01/10/2022 - 12:58

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 30 : ఇటీవలే వెలువడిన ఐఐటి ఫలితాలలో జేఈఈ ఆల్ ఇండియా 2956 ర్యాంకు పిడబ్ల్యుడి లో ఆల్ ఇండియా 3వ, ర్యాంకు సాధించిన బి అభినవ్ కుమార్ రెడ్డి కు ఐఐటీ ముంబై నందు అడ్మిషన్ పొందిన శుభ సందర్భంగా, శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అభినవ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.