తిరుమలగిరి

ఆర్థిక సాయం అందజేత

Submitted by Upender Bukka on Sat, 01/10/2022 - 11:07

తిరుమలగిరి టౌన్ సెప్టెంబర్ 30 ప్రజా జ్యోతి../...తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురం ఆరో వార్డుకు చెందిన పోతరాజు శారద, రవి ఇంట్లో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వలన గృహోపకరణాలు కాలిపోవడంతో ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబానికి తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు  కౌన్సిలర్ కుదురుపాక శ్రీలత ఆ కుటుంబాన్ని పరామర్శించి  5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

చివరి ఆయకట్టు రైతుల నీటి సమస్యను పరిష్కరిస్తాం -ఎన్నెస్పి ఈఈ కరుణాకర్,ఎంపీపీ

Submitted by venkat reddy on Fri, 30/09/2022 - 11:31

-రాజవరం మేజర్ కాలువలను పరిశీలించిన ఎన్నెస్పి ఈఈ కరుణాకర్,ఎంపీపీఆంగోతు భగవాన్ నాయక్
ఫోటో రైటప్ ః మేజర్ కాలువ ను పరిశీలించిన ఎన్నెస్పి ఈఈ కరుణాకర్,ఎంపీపీఆంగోతు భగవాన్ నాయక్

ఆ దారి గుంతల మయం

Submitted by Upender Bukka on Fri, 23/09/2022 - 12:03

తిరుమలగిరి టౌన్, సెప్టెంబర్ 22( ప్రజాజ్యోతి ) ..//.//   అడుగుకో  గొయ్యి, గజానికో గుంత అన్న చందంగా ఉంది  అనంతరం నుండి తిరుమలగిరి కి వెళ్లే దారి.అసలే దారుణంగా ఉన్న రోడ్లు వర్షాకాలపు తొలి ముసురుకే మరింత దయనీయంగా తయారయ్యాయి.  రహదారులకు కొన్ని చోట్ల మరమ్మతులు చేస్తున్నా ఎక్కువ శాతం రోడ్లు ఇంకా అత్యంత అధ్వానస్థితిలో ఉన్నాయి. నిధులున్నా బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు  రాకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది తప్పట్లేదు. ప్రధాన కూడలి ప్రాంతాలు, రద్దీ అధికంగా ఉండే దారుల్లోనే చిన్న గుంతలు పెరిగి పెద్దవవుతున్నాయి.

చదువుల ఆణిముత్యాలకు ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే గాదరి కిషోర్

Submitted by arigenagaraju on Thu, 08/09/2022 - 15:45

ప్రజా జ్యోతి తిరుమలగిరి టౌన్ ; పసునూరు మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించిన సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ గురువారం క్యాంపు కార్యాలయంలో విద్యార్థులను అభినందించారు. స్టేట్ ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా మోడల్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు ర్యాంకులు సాధించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం ఎమ్మెల్యే డా. గాదరి కిషోర్ కుమార్

Submitted by arigenagaraju on Thu, 08/09/2022 - 15:16

ప్రజా జ్యోతి తిరుమలగిరి టౌన్ ; సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం అని తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం తిరుమలగిరి క్యాంపు కార్యాలయంలో తుంగతుర్తి నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన 91 మంది లబ్ధిదారులకు మూడు లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని  ప్రజలందరూ సీఎం రిలీఫ్ ఫండ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు .

టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

Submitted by sridhar on Thu, 08/09/2022 - 11:26

 తిరుమలగిరి సెప్టెంబర్ 7 (ప్రజా జ్యోతి) తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో తుంగతుర్తి మండలం వెంపటి గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు & బీజేపీ నాయకులు గుండగాని వెంకన్న గౌడ్ గారు వారితో పాటు పలువురు నాయకులు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేడు తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.నూతనంగా TRS పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.