నల్గొండ

నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని నిరసన సీఐటీయూ

Submitted by Sathish Kammampati on Mon, 03/10/2022 - 14:26

 నల్లగొండ అక్టోబర్ 03(ప్రజాజ్యోతి)./... పెరుగుతున్న నిత్యవసరం వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం ఆరోపించారు.సోమవారం అంతర్జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అంతర్జాతీయ యాక్షన్ డే నిరసన పిలుపు మేరకు  హమాలి ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ దేశంలో ధరలు, అవినీతి, నిరుద్యోగం పెరిగిపోతున్నాయని వీటిని అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

మహాత్మా గాంధీ153 వ జయంతి

Submitted by Sathish Kammampati on Mon, 03/10/2022 - 11:45

నల్లగొండ అక్టోబర్ (ప్రజాజ్యోతి) ./...జాతిపిత మహాత్మా గాంధీ153 వ జయంతి సందర్భంగా ఈ రోజు నల్లగొండ పట్టణం రామగిరి లోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నల్లగొండ శాసన సభ సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్,ఈ సందర్భం గా నల్లగొండ శాసన సభ సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ మహానీయుల ఆశయాల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు.

సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు పై సమీక్ష

Submitted by Sathish Kammampati on Mon, 03/10/2022 - 10:51

నల్లగొండ అక్టోబర్ 02(ప్రజాజ్యోతి)./...నేడు(సోమవారం) జరుగనున్న సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు బతుకమ్మ లు  ఆడి  నిమజ్జనం కు తగిన ఏర్పాట్లు చేయాలని అర్.డి. ఓ జగన్నాథ రావు అధికారులను కోరారు.ఆదివారం సాయంత్రం అర్.డి. ఓ కార్యాలయం లో రెవెన్యూ,పోలీస్, మహిళా,శిశు సంక్షేమ శాఖ, మెప్మా,,విద్యా శాఖ,మున్సిపల్ అధికారులతో సద్దుల బతుకమ్మ సందర్భంగా వల్లభ రావు చెరువు వద్ద పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని,మహిళలు బతుకమ్మ లతో వచ్చేందుకు స్కూల్ బస్ లు ఏర్పాటు చేయాలని, డి. ఈ ఓ.ను కోరారు .వల్లభ రావు చెరువు వద్ద వేదిక ,త్రాగు నీరు,పారి శుద్యం,లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు.

మహాత్మ గాంధీ అడుగుజాడల్లో నడవటమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి -ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Submitted by Sathish Kammampati on Mon, 03/10/2022 - 10:47

నల్లగొండ అక్టోబర్ 02(ప్రజాజ్యోతి)./..మహాత్మాగాంధీ అడుగుజాడల్లో మనమంతా నడవటమే మనం మహాత్ముడి కి ఇచ్చే ఘనమైన నివాళి అని నకిరేకల్ శాసన సభ్యులు  చిరుమర్తి లింగయ్య అన్నారు..ఆదివారం నకిరేకల్ పట్టణంలో  మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా  మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ మహాత్మాగాంధీ అడుగుజాడలలో నేటి యువతరం నడవాలని, అహింసా మార్గంతోనే స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి జాతిపిత గాంధీమహాత్ముడేనన్నారు.సత్యం , అహింసా, ధర్మం, మార్గాలలో నడిచిన బాపూజీ కుల, మతవర్గ విభేదాలు లేని ఆభివృద్ధి చెందిన భారతదేశాన్ని కలలు కనటమే కాకుండా అందుకు కృషి  చేస్

కేసీఆర్, గాదరి కిషోర్ దిష్టిబొమ్మ దహనం

Submitted by Sathish Kammampati on Sat, 01/10/2022 - 11:57
  • ఆర్ ఎస్ పి పై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి
  •  ఎమ్మెల్యే గాదరి కిషోర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి
  •  నకిరేకల్ నియోజకవర్గ బిఎస్పి ఇన్చార్జ్ మేడి ప్రియదర్శిని 

నల్లగొండ అక్టోబర్ 01(ప్రజాజ్యోతి) తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్  బి ఎస్ పి అధ్యక్షులు ఆర్ఎస్పీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు.అనంతరం మాట్లాడుతూ ముందుగా వారు చేసిన ఆరోపణలు చూద్దాం దళితులంతా కేసీఆర్ వైపు ఉన్నారు.

అక్టోబర్ 1న ఫుడ్ లైసెన్స్ మేళ

Submitted by Sathish Kammampati on Sat, 01/10/2022 - 10:31

నల్లగొండ సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి)/...జిల్లాలో అక్టోబర్ 1న నిర్వహించే ఫుడ్ లైసెన్స్ మేళ ను ఉమ్మడి నల్గొండ జిల్లా చిన్న,పెద్ద వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి కృష్ణమూర్తి లు ఒక ప్రకటనలో తెలిపారు.ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల అనుసారం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్  వి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఈ లైసెన్స్ మేలాను నల్లగొండ పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద ఉన్న వాసవి భవనం లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమాన్ని  కిరాణా ,జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, డాబాలు హోటల్స్ రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, బేకరీలు, స్వీట్ షాపులు, ఆహార తోపుడు బండ్లు, చి

కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ దేశానికి ఆదర్శం

Submitted by Sathish Kammampati on Sat, 01/10/2022 - 10:09

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి

ఘనంగా బతుకమ్మ సంబరాలు

Submitted by Sathish Kammampati on Thu, 29/09/2022 - 14:03

నల్లగొండ సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి) .//,..నల్గొండ పట్టణం లోని ఎన్.జి.కళాశాల మైదానంలో బుధవారం మున్సిపల్,ట్రాన్స్కో,సంక్షేమ శాఖలు బి.సి.,ఎస్.సి.,ఎస్.టి.,మైనార్టీ సంక్షేమ శాఖలు, మెప్మా మహిళలు బతుకమ్మ ఆడుతున్న దృశ్యాలు.వివిధ శాఖలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.